కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైకిల్‌పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. పెరుగుతున్న ఇందన ధరలకు నిరసనగా ఆయన ఈ వినూత్నంగా నిరసన తెలియజేశారు. గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల తరుపున కేంద్ర ప్రభుత్వంపై తన వినూత్న నిరసనను తెలియజేశారు. బీజేపీ-ఆర్ఆర్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
దీంతో ప్రభుత్వానికి ఇలాగైన ప్రజల కష్టాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇలా వినూత్నంగా నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. దానికన్న ముందు రాహుల్ గాంధీ ప్రతిపక్ష ఇవాళ రాహుల్ గాంధీ బ్రేక్‌ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభకు ఫ్లోర్‌లీడర్లు ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. విపక్ష పార్టీ నేతలతో కాన్‌స్టూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడాలని రాహుల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష ధోరణిక వ్యతిరేకంగా అందరూ పోరాడాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆనంతరం ఆయన సైకిల్‌పై పార్లమెంటు బయలు దేరారు.
One priority- our country, our people : Sh.@RahulGandhi pic.twitter.com/Oy7vQ3NOk7
— Punjab Pradesh Congress Sevadal (@SevadalPB) August 3, 2021