మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తనయుడు రాహుల్ గాంధీ నివాళులల్పిరించారు. ఈ మేరకు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరీ తో పాటు తదితర కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీ గల్లీలో రాజీవ్ చిత్ర పటాలకు పూలమాలలె వేసి నివాళులర్పించారు.
ఇక తెలంగాణ టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఇక దేశ ప్రధాని నరేంద్రమోడీ రాజీవ్ గాంధీ సేవలను కొనియాడి ఆయనను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో సైతం పోస్టు చేశారు మోదీ. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పిస్తున్నారు.