కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. మిగిలిన వివరాలు..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి తాజాగా ఓ సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం రాహుల్ మీద అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. తాజాగా సూరత్ కోర్టు తీర్పుతో ఎంపీగా రాహూల్ గాంధీపై అనర్హత వేటు పడింది. 2019 కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో ‘దేశంలో దొంగల ఇంటిపేర్లన్నీ మోడీనే అవుతున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోడీపై రాహూల్ గాంధీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కాగా, మోడీపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ప్రస్తుతానికి రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ ఇచ్చింది.
కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై కోర్టులు గనుక సూరత్ కోర్టు తీర్పును కొట్టేయకపోతే రాహుల్ 8 ఏళ్లపాటు ఎలక్షన్లలో పోటీ చేయడానికి ఆస్కారం ఉండదు. అయితే సూరత్ కోర్టు తీర్పు మీద ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని మ్లలికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ ఇలా చేస్తుందనే విషయాన్ని తాము ముందే ఊహించామని చెప్పారు. రాహుల్ నోరు నొక్కడానికే అధికార పార్టీ ఇలా చేసిందని ఖర్గే విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు
ఎంపీగా రాహుల్ గాంధీ అర్హత చెల్లుబాటు కాదని ప్రకటించిన లోక్‌సభా సెక్రటరీ జనరల్. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షతో నిర్ణయం. #RahulGandhi #PMModi #MP #LokSabha #SumanTV
— SumanTV (@SumanTvOfficial) March 24, 2023