విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్స్ వీరులకు ప్రధాని మోడీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన మోడీ అథ్లెట్ల కృషిని కొనియాడారు ఈ సందర్భంగా క్రీడాకారులు తమ ఆట వస్తువులను మోడీకి అందించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుతో ఒలింపిక్స్‌కు బయల్దేరే ముందు ఇచ్చిన మాటను ప్రధాని నిలబెట్టుకున్నారు. ఒలింపిక్స్ ఆటలకు సన్నద్ధమైన పీవీ సింధు తమ డైట్ లో ఐస్ క్రీమ్ తీసుకునేది కాదు. ఆ విధంగా చాలా రోజుల పాటు ఐస్ క్రీమ్ ముట్టుకోలేదు. ఈ నేపథ్యంలో దేశానికి కాంస్య పథకం పట్టుకొచ్చిన పీవీ సింధుకి ఐస్ క్రీమ్ ఆఫర్ చేసారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సంధర్భంగా తన బాడ్మింటన్ రాకెట్ ని ప్రధానికి బహుమతిగా సింధు ఇవ్వడం విశేషం.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న పీవీ సింధు, ప్రధాని సమక్షంలో అరుదైన గౌరవం లభించిందని తెలుపుతూ పోస్ట్ చేసింది. తన బాడ్మింటన్ రాకెట్ ని ప్రధానికి బహుమతిగా ఇచ్చి, చిన్న బహుమతిని ప్రధానికి ఇస్తున్నట్లు పీవీ సింధు అభివర్ణించింది. మొత్తానికి దేశం మొత్తం గర్వించేలా చేసిన క్రీడాకారులందరికీ గౌరవ సత్కారాన్ని ప్రధాని అందజేసారు. ఈ కారణంగా యువతలో ఆటల పట్ల స్ఫూర్తి పెరగాలని, దేశం ఖ్యాతిని దశ దిశలా వ్యాపించేలా చేయాలని యువతకు సందేశం ఇచ్చారు.
టోక్యో ఒలింపిక్స్ ఆటల్లో కాంస్య పతకం గెలుచుకుని భారత్ తరపున ఒలింపిక్స్ ఆటల్లో రెండు పతకాలు గెలుచుకున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధు కి అభినందనలు వెల్లువలా వచ్చాయి. ఒలింపిక్స్ ఆటగాళ్ళందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ సత్కారాలు చేసారు. ఆటగాళ్ళందరికీ బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసారు. అందులో భాగంగా బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో ముచ్చటించిన ప్రధాని, ఐస్ క్రీమ్ ఇప్పించారు.
This will always be a very special interaction with Hon’ble PM @narendramodi ji for me. As I’m overwhelmed by the support, I was happy to discuss how I can also support badminton in India with him, along with an exceptional team of people 🙏🏽 pic.twitter.com/XBD2evhzXz
— Pvsindhu (@Pvsindhu1) August 18, 2021