ప్రేమ అనేది ఎవరి మధ్య ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అయితే ఇలా పుట్టిన ప్రేమల్లో కొన్ని మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒడిశాలో కలెక్టర్ల వివాహలు చర్చనీయంశంగా మారాయి.
ప్రేమ అనేది ఎవరి మధ్య ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అయితే ఇలా పుట్టిన ప్రేమల్లో కొన్ని మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. ఇలా ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కిన వారిలో సామాన్యులను మొదలుకుని ఐఏఎస్ అధికారులు, సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఉన్నాను. ఇలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంటలో స్టోరీల్లో అనేక ట్విస్టులు ఉంటాయి. తాజాగా ఇద్దరు కలెక్టర్లు కూడా ప్రేమించుకుని, పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. అయితే వీరి స్టోరీలో ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. అది ఏమిటో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఒడిశాలో ఇద్దరి ఐఏఎస్ ల పెళ్లి ఆసక్తిగా మారింది. జిల్లా పాలనాధికారిగా వ్యవహరించే ఇద్దరు కలెక్టర్లు వివాహం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. కారణం.. సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ లు పెళ్లిళఅలు చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఎందరో సివిల్స్ సర్వీస్ అధికారులు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అయితే తాజాగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు, అందులోనూ కలెక్టర్లు పెళ్లి చేసుకోనున్నారు. జిల్లా కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కలెక్టర్ల పెళ్లి కాస్తంత అరుదైన ఘటనే అని చెప్పాలి.
ఒడిశాలో రాష్ట్రంలోని పూరీ జిల్లా కు సమర్థ వర్మ కలెక్టర్ గా పని చేస్తున్నారు. అలానే రాయగడ జిల్లాకు స్వాధా దేవ్ సింగ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు ప్రేమించుకుని ఈ నెల 15వ తేదీన పెళ్లి చేసుకోనున్నారు. స్వాధా దేవ్ సింగ్ స్వస్థలమైన యూపీలోని వారణాసిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్‌లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇక్కడ అసలు ట్వీస్ట్ ఏంటంటే.. వారిద్దరికి ఇది రెండో వివాహం. స్వాధా దేవ్ సింగ్ కొంతకాలం కిందట చంచల్ రాణా అనే ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లైన కొంతకాలనికి వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సమర్థ వర్మ కూడా కొన్ని నెలల కిందటే సుచీ సింగ్ అనే అధికారిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దిరికి కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తమ భాగస్వాములతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్న స్వాధా దేవ్ సింగ్, సమర్థ మధ్య పరిచయం ఏర్పడింది. చివరకు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. కలెక్టర్ల వరుస పెళ్లిళ్లు ఒడిశాలో చర్చనీయాంశంగా మారాయి. మరి.. ఇలా వెరైటీ ట్విస్టులతో జరుగుతున్న పెళ్లిలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.