జీవితం అన్నాక ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుంతుందో ఊహించలేం.. పంజాబ్ కి చెందిన మన్ దీప్ కౌర్ జీవితంలో అలాంటి ప్రతిఘటనలే ఎదురయ్యాయి. అనుకున్నట్లుగా వివాహం జరిగింది.. దాంపత్య జీవితం చక్కగా సాగిపోతోంది. ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి ముఖంపై గుబురు గడ్డం, మీసాలు దర్శనమిచ్చాయి. అంతే.. దీనిని అవమానంగా భావించిన భర్త ఆమెను వద్దనేశాడు. ఇలా ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆమెకే ఎందుకిలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా! ఐతే ఈ కథనాన్ని చదివేయండి.
సాధారణంగా మీసాలు, గడ్డాలు అబ్బాయిలకు ఉండటం అన్నది సహజం. అయితే అక్కడక్కడా కాస్త మీసాలు వచ్చినట్టుగా అవాంఛిత రోమాలతో అమ్మాయిలు కనిపించడం కూడా సహజమే. కానీ పూర్తిగా అబ్బాయిలకు వచ్చినట్టుగా మీసాలు, గడ్డాలు వస్తే ఎలా ఉంటారో తెలుసా..? మన కథనంలో ఉన్న మహిళవలే. పెళ్ళికి ముందు ఎలాంటి మచ్చ లేని ఆమె ముఖంపై అకస్మాత్తుగా వెంట్రుకలు మొలిశాయి. అక్కడి నుండి తన జీవితమే తలకిందులైంది. ఆమెకు ఇలా ఎందుకు జరిగింది..? కారణమేంటి..? ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
పేరు.. మన్‌దీప్ కౌర్. పంజాబ్‌కు చెందిన ఆమె పెళ్ళికి ముందు ఎంతో అందంగా, అపురూపంగా.. ఒక బొమ్మలా ఉండేది. ముచ్చటపడ్డ ఓ వ్యక్తి ఆమెను ఎంతో ఆర్భాటంగా వివాహమాడారు. అనంతరం వీరి దాంపత్య జీవితం కొన్నేళ్ల పాటు సజావుగానే సాగింది. అయితే, కొన్నేళ్ల తర్వాత ఆమె శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా ముఖంపై గడ్డం, మీసాలు రావడం మొదలైంది. దాచుకోవడానికి వీలు కాలేదు. వీటిని చూసిన భర్త, నలుగురికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందన్న వంకతో ఆమెకు విడాకులిచ్చాడు. అక్కడితో ఆమె జీవితం తలకిందులైంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అనంతరం కొన్నాళ్ళకు వాస్తవాన్ని గ్రహించి గుబురు గడ్డం, మీసాలతోనే సమాజంలో తిరగటం ప్రారంభించింది.
ప్రస్తుతం ఆమె వయస్సు.. 31 సంవత్సరాలు. రైతు కుటుంబంలో పుట్టిన ఆమె వ్యవసాయం చేస్తూ అందమైన జీవితాన్ని గడుపుతోంది. మందపాటి గడ్డం, తలపాగా, ముఖంపై పెరిగిన వెంట్రుకలతో మగరాయుడిలా ద్విచక్రవాహనంపై రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. “మొదటిసారి నన్ను నేను అలా చూసుకున్నాక బతుకే భారమనిపించింది. నలుగురిలోకి వెళ్లాలంటే అదోలా అనిపించేది. క్రమక్రమంగా ఆ నిరాశ నుంచి బయటపడ్డాడని చెప్పుకొచ్చింది”. తనను తొలిసారి చూసిన వారందరూ పురుషడే అనుకుంటారని ఆమె చెప్పటం గమనార్హం. కాగా, ఇలాంటి సమస్య ఆమెకే కాదు.. గతంలో ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నట్లు వార్తలొచ్చాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణంగా ఈ విధంగా మహిళల్లో కూడా వెంట్రుకలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.