ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు కొందరు తనతో తప్పుగా ప్రవర్తించారంటూ ఓ యువతి మీడియాకు ఎక్కింది. పాకిస్తాన్‌కు వెళ్లటానికి వీసా కోసం పాకిస్తాన్ ఎంబసీకి వెళ్లిన తనను అధికారులు దారణమైన ప్రశ్నలు వేసి వేధించారని వెల్లడించింది. ఓ నేషనల్ మీడియాతో ఆమె మాట్లాడుతూ 2021లో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను పంజాబ్‌లోని ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. 2021లో ఆన్‌లైన్‌లో పాకిస్తాన్ హై కమిషన్‌తో వీసా అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. నాకు ఎంబసీ నుంచి కాల్ వచ్చింది. నేను అక్కడికి వెళ్లాను. ఎందుకు లాహోర్‌కు వెళ్లాలనుకుంటున్నావని వాళ్లు అడిగారు. లాహోర్‌లోని కొన్ని ప్రముఖ కట్టడాలను చిత్రీకరించటానికి వాటి గురించి రాయటానికి వెళుతున్నానని చెప్పాను.
అంతేకాదు! నన్ను లాహోర్‌లోని ఓ యూనివర్శిటీ ఉపన్యాసం ఇవ్వటానికి పిల్చిందని, అక్కడికి కూడా వెళ్లాల్సి ఉందని చెప్పాను. అంతా అయిపోయిన తర్వాత నేను అక్కడినుంచి వెళ్లిపోతున్నాను. ఓ అధికారి నన్ను పిలిచాడు. ‘‘ నువ్వు ఇంత వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటున్నావు? నీలోని శృంగార కోర్కెలు తీర్చుకోవటానికి ఏం చేస్తావు?’’ అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశాడు. నేను ఆ టాపిక్‌ను మార్చటానికి ప్రయత్నించినా అతడు వదల్లేదు. నేను దీని గురించి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి ఫిర్యాదు చేశాను. అంతేకాదు పాకిస్తాన్ ఉన్నతాధికారులకు కూడా దీనిపై ఫిర్యాదు చేశాను’’ అని తెలిపింది. మరి, ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు కొందరు తనతో తప్పుగా ప్రవర్తించారంటున్న ఈ యువతి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.