ప్రమాదాలు ఏ మూల నుంచి పొంచి ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా పంజాబ్‌లోని బటిండాలో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. విధులు ముగించుకొని బస్టాంట్ లో బస్సులను పార్కింగు చేసే సమయంలో నిప్పు అంటుకోవడంతో అవి దగ్ధం అయ్యాయి.. అందులో ఉన్న కండక్టర్ సజీవదహనమైన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బస్టాంట్ లో నిలిపిన ఒక బస్సుకు నిప్పు అంటుంది.. క్రమంగా అవి పక్కన బస్సులకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో కండక్టర్ సజీవ దహనం కావడంతో సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. అప్పటి వరకు తమతో డ్యూటీ చేసిన వ్యక్తి తమ కళ్ల ముందే చనిపోవడం అందరినీ కలిచి వేసింది. అయితే ఇందులో రెండు బస్సులు కొత్తవి.. వీటిని ఈరోజే ప్రారంభించాల్సి ఉంది.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.
బస్టాండ్ లో ఒకేసారి మూడు బస్సులు దగ్దమైన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Punjab | One bus conductor died after 3 buses were gutted in a fire that broke last night at around 10.30 pm at a bus stand in Bathinda pic.twitter.com/lsfOtOd1fi
— ANI (@ANI) April 29, 2022