పంజాబ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అమృత్ పాల్ సింగ్. గత ఏడా ది ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్.. నటుడు దీప్ సిద్దు చనిపోయిన తర్వాత అనూహ్యంగా వెలుగులోకి వచ్చాడు. అతడు స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థను హైజాక్ చేసి.. దాని అధిపతి తానేనని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేయించడంతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది.
ఖలీస్తాన్ వేర్పాటు వాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. గత ఐదు రోజులుగా అతని కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తుండగా.. వారి కళ్లు కప్పి పలు వాహనాల్లో తప్పించుకు తిరుగుతున్నాడు. గతేడాది ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్.. నటుడు దీప్ సిద్దు చనిపోయిన తర్వాత అనూహ్యంగా వెలుగులోకి వచ్చాడు సిద్దు స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థను హైజాక్ చేసి.. దాని అధిపతి తానేనని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేయించడంతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే అతడిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడూ ఖలిస్తాన్‌కు అనుకూలంగా ఉంటూ.. పాక్ గూఢచారి సంస్థతో చేతులు కలిపి తెరవెనుక చాలా కథ నడిపించినట్టు నిఘా నివేదికలు పేర్కొంటున్నాయి. దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసిన సమయంలోనే ఐఎస్ఐ ఏజెంట్లను కలుసుకుని.. జార్జియాలో ఆ సంస్థ ఉగ్రవాదుల వద్ద శిక్షణ తీసుకున్నట్టు తెలిసింది. శిక్షణ తర్వాతే ఐఎస్ఐ వ్యూహాన్ని అమలు చేయడానికి అతడు భారత్‌కు వచ్చినట్టు వెల్లడయ్యింది.
అంతేకాదూ అమృత్ పాల్ స్రీలోలుడు అని కూడా తెలుస్తోంది. అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు తాజాగా గుర్తించారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలో పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్స్, ముద్దులు, మురిపాలుకు సంబంధించని ఫోటోలు, వాయిస్ నోట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే 12 వాయిస్ నోట్‌లు ఓ మీడియా సంస్థకు చిక్కాయి. అందులో తాను మహిళలతో టైంపాస్ కోసం లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు ఒకరితో అమృత్‌పాల్ సింగ్ చెబుతుండటం గమనార్హం. ఈ మహిళల్లో కొందరు వివాహితలు, యువతులు ఉన్నట్లు గుర్తించారు. అంతటితో ఆగిపోలేదు అతడి ఘన కార్యం. కొన్ని ప్రయివేట్ వీడియోలతో కొంత మంది మహిళల్నిబ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకున్నట్టు తెలుస్తోంది. తనకు శాశ్వత బంధం అంటే అయిష్టమని, వైవాహిక జీవితాన్ని ప్రభావితం కాకుండా తనతో వివాహేతర సంబంధాలు కొనసాగించే మహిళలను మాత్రమే తాను కోరుకుంటానని ఓ మహిళతో చాటింగ్ చేస్తూ చెప్పడం, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది.
.
అమృత్ పాల్ 12 గంటల్లో మొత్తం 5 వాహనాలను మార్చడంతో పాటు గన్‌పాయింట్‌లో బైక్ చోరీ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు అమృత్‌పాల్ సింగ్ మామతో పాటు 120 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడి భార్య, తల్లిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నలుగురిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ)ను ప్రయోగించారు. వారిని అస్సాంలోని దిబ్రూగడ్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, అమృత్‌పాల్ పాకిస్థాన్ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ ఇంటెలిజెన్స్ అధికారి ఎన్డీటీవీకి వెల్లడించారు. దీంతోపాటు పంజాబ్‌లో కల్లోలం సృష్టించాలనే ప్రణాళికతో అతడు పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అందజేస్తోన్న ఆయుధాలను అమృత్‌పాల్ సింగ్ డీఅడిక్షన్ సెంటర్లు, జల్‌పూర్ ఖేడా వద్ద కొన్ని ప్రార్థనా మందిరాల్లో భద్రపర్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఆయుధాల తరలింపు, తుపాకులను బహిరంగంగా ప్రదర్శించడం వంటి పనులు చేశాడు.