ఆర్ధికంగా ఎన్నో బాధలు పడుతున్ననవారికి ఒక్కోసారి అదృష్ట లక్ష్మి తలుపు తట్టి మరీ పలుకరిస్తుంది. ముఖ్యంగా లాటరీ రూపంలో పేదరికంలో ఉన్నవారిని అదృష్టవంతులను చేస్తుంది. పంజాబ్ లూధియానాకు చెందిన ఓ కానిస్టేబుల్ కి అదృష్టం కలిసి రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే..
లూధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ అనే కానిస్టేబుల్ కి అనుకోకుండా అదృష్టం లాటరీ రూపంలో కలిసి వచ్చింది. గంగానగర్ కి చెందిన కుల్దీప్ సింగ్ ది కడు పేద కుటుంబం. కుల్దీప్ ని తల్లి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి పెంచింది. చిన్నప్పటి నుంచి పేదరికంతోనే కుల్దీప్ ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న ఆయన కోరిక నెరవేరింది. కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగం తో పాటు మరో అదృష్టం కూడా కలిసి వచ్చింది.
ఒకసారి తన తల్లి చెప్పిందని ఆరు రూపాలు పెట్టి ఒక లాటరీ కొన్నాడు. కానీ దానికి లక్షలు కలిసి వస్తాయని ఊహించలేదు. ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాడు. దీంతో కుల్దీప్ తో పాటు ఆయన తల్లి పట్టరాని సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇక లాటరీ అమ్మిన యజమాని మాట్లాడుతూ.. కుల్దీప్ కి కోటి రూపాలు రావడం సంతోషంగా ఉందని.. తాను గత కొంత కాలంగా అమ్ముతున్న లాటరీల్లో కొంత మంది మూడు కోట్లు గెల్చుకున్నారని తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.