రాజుల కాలంలో.. ఆఖరికి బ్రిటీషర్ల పాలనలో కూడా మన దేశంలో వింత వింత పన్నులు ఉండేవి. ఇళ్లు కడితే పన్ను.. పెళ్లి చేసుకుంటే పన్ను.. ఆఖరికి.. రాజుగారి విలాసాల కోసం కూడా.. సామాన్య ప్రజల మీద పన్ను విధించేవారు. రకరకాల పన్నులతో ప్రజల నడ్డి విరిచేవారు. రాజులు పోయాయి.. రాజ్యాలు పోయాయి.. కానీ పన్ను వ్యవస్థ మాత్రం పోలేదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు.. మన సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పన్నులు కడుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్ను చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. భూమి నుంచి నీరు తొడతే పన్ను కట్టాలంటూ ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
పంజాబ్ ప్రభుత్వం ఇలాంటి సంచలన నిర్ణయంతో ప్రజలకు షాక్ ఇచ్చింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. సరికొత్త పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. భూమిలోంచి నీరు తోడితే.. పన్ను కట్టాలని ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి పంజాబ్ రాష్ట్ర నీటి నియంత్రణ, అభివృద్ధి యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కానీ సర్కార్ మాత్రం.. భూగర్భ జలాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
అంతేకాక వ్యవసాయ, తాగునీరు, గృహ అవసరాల నిమిత్తం భూగర్భ జలాన్ని తొడితే.. ఎలాంటి పన్ను విధించబోమని.. తెలిపింది. అంతేకాక.. ప్రభుత్వ నీటి పథకాలు, సైనిక బలగాలు, పుర, నగర పాలక, పంచాయతీరాజ్ సంస్థలు, కంటోన్మెంట్ బోర్డులు, అభివృద్ధి మండళ్లు, ప్రార్థనా స్థలాలకు కూడా దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. వీరు కాక ఇతర వర్గాలు భూగర్భ జలాన్ని వాడుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారు పన్ను కట్టాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు అంతరించి పోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.