కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ ఉద్యోగుల విషయంలో తరచూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీఏ అలవెన్సులు పెంచుతూ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అలానే ఉద్యోగుల పని విషయంలో కూడా పలు కీలక ఆదేశాలు ప్రభుత్వాలు జారీ చేస్తుంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ ఉద్యోగుల విషయంలో తరచూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీఏ అలవెన్సులు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలానే ఉద్యోగుల పని విషయంలో కూడా పలు కీలక ఆదేశాలు ప్రభుత్వాలు జారీ చేస్తుంటాయి. ముఖ్యంగా విపత్కర పరిస్థితులు, కరోనా మహమ్మారి లాంటి వైరస్ లు విజృంభించినప్పుడు, సీజన్ లో ఏర్పడే సమస్యల కారణంగా విధుల్లో కీలక మార్పులు చేస్తుంటారు. అయితే తాజాగా పంజాబ్ ప్రభుత్వం వారి ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. మరి.. అది ఏమిటో ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవి కాలం రాక ముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇలానే వేసవికాలం విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు, పనుల నిమిత్తం బయటక వెళ్లే ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్చాలని నిర్ణయించింది. విద్యార్థులకు ఒంటి పూట బడుల తరహాలోనే ఉద్యోగులకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఆఫీసులు పని చేస్తాయని పంజాబ్ సీఎం భగవత్ మన్ శనివారం ప్రకటించారు.
ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వం ఆఫీసులు పని చేస్తున్నాయి. మే 2 నుంచి నూతన పని వేళల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు అంటే జులై 15 వరకు ఈ పనివేళలనే ఉద్యోగులు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరెందరిని సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యుత్ వినియోగం తగ్గి, భారం కూడా తగ్గుతుందన్నారు.
తాను కూడా ఉదయం 7.30 గంటలకే కార్యాలయానికి వస్తానని సీఎం తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పని వేళలకు తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. మరి.. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ਪੰਜਾਬ ਦੇ ਸਰਕਾਰੀ ਦਫ਼ਤਰਾਂ ਦਾ ਸਮਾਂ 2 ਮਈ,2023 ਤੋਂ ਸਵੇਰੇ 7.30 ਤੋਂ ਦੁਪਹਿਰ 2 ਵਜੇ ਤੱਕ ਕਰ ਦਿੱਤਾ ਗਿਆ ਹੈ
ਇਹ ਫ਼ੈਸਲਾ 15 ਜੁਲਾਈ,2023 ਤੱਕ ਜਾਰੀ ਰਹੇਗਾ
ਆਮ ਲੋਕਾਂ ਤੇ ਮੁਲਾਜ਼ਮਾਂ ਨੂੰ ਗਰਮੀ ‘ਚ ਕੰਮ ਕਰਨ ਤੇ ਕਰਵਾਉਣ ਤੋਂ ਨਿਜ਼ਾਤ ਮਿਲੇਗੀ
—CM @BhagwantMann pic.twitter.com/8vkl44AKAv
— AAP Punjab (@AAPPunjab) April 8, 2023