ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు సహా పలువురు భారతీయ విద్యార్థులకు బెదిరింపులు వెళ్లాయి. స్టూడెంట్స్‌ను చంపేస్తామంటూ ఒక గ్రూప్ వార్నింగ్ ఇచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..
ఖలిస్థానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో ఖలిస్థానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్పై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఖలిస్థాన్ గ్రూపుల నుంచి తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్, సందేశాలు వచ్చాయని పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న భారతీయ కుటుంబాలు వాపోతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్‌కు కూడా ఈ బెదిరింపులు వెళ్లాయని సమాచారం. సీరత్‌కు బెదిరింపులు వెళ్లిన విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు.
సియాటెల్‌లో ఉంటున్న సీరత్ కౌర్‌ను చంపేస్తామని ఖలిస్థానీ గ్రూపుల నుంచి బెదిరింపులు వెళ్లాయట. దీంతో ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివార్ కోరారు. మరోవైపు ఈ బెదిరింపుల అంశాన్ని హర్మీత్ బ్రార్ అనే అడ్వకేట్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. విద్యార్థులను బెదిరించినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన ఖలిస్థాన్ సిద్ధిస్తుందా అని ఆమె తన పోస్ట్‌లో ప్రశ్నించారు. సీరత్ కౌర్‌కు బెదిరింపులు వెళ్లిన విషయాన్ని ఆమె తల్లి ఇందర్‌ప్రీత్ కౌర్ గ్రెవాల్ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని.. తమను వదిలేయాలంటూ ఖలిస్థానీలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉంటే.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మొదటి భార్యే ఇందర్‌ప్రీత్. వీళ్లకు ఇద్దరు సంతానం ఉన్నారు. అందులో ఒకరు కూతురు సీరత్ కాగా.. మరొకరు కొడుకు దిల్షాన్. 2015 నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం కొడుకు, కూతురితో కలసి విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు ఇందర్‌ప్రీత్. ఇక, గతేడాది గురుప్రీత్ కౌర్ అనే డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు మాన్. కాగా.. అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. గత 14 రోజులుగా అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అమృత్‌పాల్ అనుచరులను వంద మందికి పైగా అరెస్ట్ చేశారు. వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Punjab Chief Minister Bhagwant Mann’s daughter Seerat Kaur Mann received abusive calls from pro-Khalistan elements, alleged a Patiala-based lawyer.https://t.co/TqoRJPjbHs
— The Indian Express (@IndianExpress) March 29, 2023