పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంత కాలం నుంచి వాడీ వేడీగా నలిగిన విభేదాల నడుమ ఎట్టకేలకు అమరీందర్ సింగ్ ఓ మెట్టు దిగి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక రాజీనామా అనంతరం లేఖను గవర్నర్ కు అందించారు అమరీందర్ సింగ్.
అయితే ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సిద్దూ వర్గానికి, అమరీందర్ వర్గానికి గత కొంత కాలం వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేశారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని కారణంగానే పార్టీ అధిష్ఠానం మేరకు అమరీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక పంజాబ్ రాజకీయాల్లో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయో చూడాలి మరి.