పంజాబ్‌లో ఓ యువనేతపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి తెగ బడ్డారు. అకాలీ దళ్‌కి చెందిన యువనేత విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖెరాను అత్యంత పాశవికంగా వెంటాడి మరి తుపాకులతో కాల్చి చంపారు. పంజాబ్ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. శనివారం ఉదయం కారు వద్దకు వస్తున్న తరుణంలో ఇద్దరు దుండగులు కాపు కాచి హత్య చేశారు. ఏకంగా 15 బుల్లెట్లను అతని శరీరంలోకి దించారు.
ఇక పోలీసుల సమాచారం ప్రకారం..సెక్టర్ 71లోని ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసుకు వెళ్లిన విక్రమ్ జిత్ తిరుగు ప్రయాణంలో భాగంగా తన కారులోకి ఎక్కుతోన్న సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు గన్‌తో వచ్చి పరుగెత్తించి పరుగెత్తించి మరి కాల్చి చంపారు. పరుగెత్తేందుకు ప్రయత్నించినా అయినా వదల్లేదు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో నడి రోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. ఇక విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖెరా అకాలీ దళ్ స్టూడెంట్ వింగ్ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజకీయ కుట్రతోనే విక్రమ్‌జిత్‌ను హత్యచేశారని ఆయన వర్గం అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇక ఆయన మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు.