వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొంత మంది గాయాలపాలవుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు.
మన దేశంలో ఈమధ్య రోడ్డు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఫలానా రాష్ట్రమని కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. యాక్సిడెంట్లకు సంబంధించిన వార్తలను టీవీల్లోనూ, పత్రికల్లోనూ చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనల్లో కొందరు మరణిస్తుండటం, మరికొందరు గాయాలపాలవుతుండటం చూస్తున్నాం. దీంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితుల్లో ఊహించినంత మార్పులు రావడం లేదు.
ర్యాష్ డ్రైవింగ్, నిద్రమత్తులో వాహనాలు నడపడం, మద్యం తాగి వాహనాలు తోలడం లాంటివి ఎక్కువగా యాక్సిడెంట్లకు కారణాలు అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మీద ఖోపోలికి సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు.. రెండు కార్లను ఢీకొట్టింది. దీంతో ఆ రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ట్రక్కు, రెండు కార్లతో పాటు మొత్తంగా ఏడు వాహనాలు భారీగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారని సమాచారం. ఈ ఘటనతో హైవే మీద భారీగా గ్రాఫిక్ జామ్ అయ్యింది.
#WATCH | Collision of 7 vehicles on Mumbai-Pune Expressway at Khopoli, four people injured#Maharashtra pic.twitter.com/lIIuClOERx
— ANI (@ANI) April 27, 2023