మనం డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా అని విని ఉంటాం. అయితే బెంగుళూరులో ఓ వింత మాఫియా కలకలం రేపుతుంది. అదేమంటే పంక్చర్ మాఫియా. అవునండీ మీరు విన్నది నిజమే!
మనం డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా అని విని ఉంటాం. అయితే బెంగుళూరులో ఓ వింత మాఫియా కలకలం రేపుతుంది. అదేమంటే పంక్చర్ మాఫియా. అవునండీ మీరు విన్నది నిజమే! ఇది కొత్తగా బెంగళూరులో పుట్టుకొచ్చింది. ప్రస్తుతం పంక్చర్ మాఫియా బెంగుళూరులో వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. పంక్చర్ షాప్‌ల దగ్గరలో చీటికి మాటికి వాహనాలు పంక్చర్ అవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.అసలేం జరుగుతుందో వివరాలలోకి వెళితే..
బెంగళూరు నగరంలోని పంక్చర్ షాపులకు ఒక కిలోమీటర్ దూరంలో దుండగులు రహదారులపై, కూడళ్ల వద్ద చిన్న చిన్న మేకులు, మొనదేలిన తీగలు పడేస్తున్నారు. అవి వాహనాల టైర్లకు గుచ్చుకోగానే పంక్చర్ అవుతున్నాయి.
దీంతో పంక్చర్ షాపులు నగదు చేసుకుంటున్నాయని పోలీసులు తెలుపుతున్నారు. నిత్యం అనేపాళ్య, నంజప్ప జంక్షన్, అపేరా కూడలి మొదలైన ప్రాంతాలలో పోలీసులు కిలోల చొప్పున మేకులు, ఇనుప చువ్వలను కనుగొని సేకరిస్తున్నారని తెలిపారు. దత్తపీఠానికి వెళ్లే మార్గంలో మేకులు ఎక్కువగా సేకరిస్తున్నారని.. పంక్చర్ మాఫియా ఈ సరౌండింగ్ లోనే ఉందని పోలీసులు గుర్తించారు. అయితే సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి మాఫియా చేసే ఆగడాలను అరికడతామని ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ తెలిపారు. పోలీసులకు కూడా తలనొప్పిగా మారిన పంక్చర్ మాఫియాను అరికట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాహనదారులకు మద్ధతుగా వ్యవహరిస్తామని మహ్మద్ ఇమ్రాన్ అలీ తెలిపారు.