ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి.. హుషారుగా గడిపిన వ్యక్తులు ఉన్నట్లుండి గుండెపోటుతో మృతి చెందిన సంఘటనలు అనేకం చూశాం. చిన్న పిల్లలు కూడా ఇలా సడెన్‌గా గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు చూశాం. అయితే గుండెపోటు అనేది కేవలం మనుషుల్లోనే కనిపిస్తుందా.. అంటే కాదు.. జంతువులు కూడా గుండెపోటు బారని పడుతున్నాయి. ఇక తాజాగా వాకింగ్ చేస్తూ.. ఓ ఏనుగు గుండెపోటుతో మృతి చెందింది. అది కూడా ఆలయంలోని ఏనుగు కావడంతో.. భక్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక సదరు గజరాజు మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆ వివరాలు..
పుదుచ్చేరిలో మనాకుల వినాయక ఆలయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ వినాయక ఆలయంలో లక్ష్మి అనే ఏనుగు ఎప్పటి నుంచో ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా లక్ష్మీ ఆశీస్సులు తీసుకుంటారు. చిన్న పిల్లలు సైతం లక్ష్మీ దగ్గరకు వెళ్లి.. దాని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అంతలా భక్తులతో కలిసి పోయిన లక్ష్మీ బుధవారం మృతి చెందింది. లక్ష్మీని ఉదయం వాకింగ్ కోసం కోసం ఇద్దరు మావటిలు బయటకు తీసుకెళ్లారు. అలా నడుస్తూ.. ఓ పాఠశాల సమీపానికి చేరుకోగానే లక్ష్మీ రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మావటిలు చేసిన సంజ్ఞలకు స్పందించలేదు. దాంతో వారు వెంటనే ఆలయ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ తర్వాత కాసేపటికే లక్ష్మీ తుది శ్వాస విడిచింది. అంతవరకూ ఆరోగ్యంగానే ఉన్న ఆ ఏనుగు అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్లే చనిపోయిందని భావిస్తున్నారు.
ఇక లక్ష్మీ సంరక్షణ చూస్తున్న స్థానిక వెటర్నరీ డాక్టర్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఇక లక్ష్మీ మృతి చెందింది అనే విషయం తెలుసుకుని.. భక్తులతో పాటు.. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఏనుగు పార్థీవదేహానికి నివాళి అర్పించారు. లక్ష్మీ మృతికి సంతాప సూచకంగా నేడు ఆలయ ద్వారాలు మూసివేశారు. లక్ష్మీ కుప్పకూలిన ప్రదేశం నుంచి భారీ క్రేన్ సాయంతో ఎత్తి, ట్రక్కులో ఆలయ ప్రాంగణానికి తరలించారు. అక్కడ భక్తులు నివాళి అర్పించేదుకు అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తిచేశారు. లక్ష్మీ కడసారి చూసేందుకు.. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. .
Paid last respects to “Laxmi” Sri Manakula Vinayagar Temple’s Spiritual Elephant in #Puducherry.
Recalled her blessings during my visits to the temple.புதுச்சேரி,அருள்மிகு ஸ்ரீமணக்குள விநாயகர் திருக்கோயில் யானை லட்சுமியின் பூத உடலுக்கு மலர்தூவி அஞ்சலி செலுத்தினேன். pic.twitter.com/XFIdJTkNnu
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2022
Miss u chellame… Can’t control my tears unna paakatha naal illa… Nee nadanthu pona en kannula maraiyara varaikum paathutu irupan.. Inimae unna pakamudiyathunu nenaikum bothu azhugaya varuthu #lakshmielephant #RIPLakshmi forever in pondicheeriyan memory 😭😭😭 pic.twitter.com/Wq16Wb2k38
— THALAPATHY (@Johnny_Blaaze27) November 30, 2022
ఇక 1995లో లక్ష్మీకి పదేళ్ల వయసు ఉండగా ఓ వ్యాపారి వినాయక ఆలయానికి అందజేశారు. నాటి నుంచి అక్కడే ఉంది. స్వామి వారి పూజా కార్యక్రామాల్లో పాల్గొనేది. ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదించేది. విదేశీ భక్తులు కూడా ఈ ఏనుగు ఆశీర్వాదాలు తీసుకొని మురిసిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆలయానికి ఎప్పుడు వచ్చినా ‘లక్ష్మీ’ ఆశీర్వాదాలు ఇచ్చేదంటూ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు గవర్నర్ తమిళిసై.
ஸ்ரீ மணக்குள விநாயகர் ஆலயத்தின் லட்சுமி எனும் கோவில் யானை இறைவனடி சேர்ந்தது ஆழ்ந்த இரங்கல் 🙏😭💔#templeelephant #lakshmielephant pic.twitter.com/3YWq3Gjf9i
— Manikandan Actor (@act_mani) November 30, 2022