కొన్ని సార్లు సాంకేతిక లోపం వల్లనో.. ఏదైనా పక్షులు ఢీ కొట్టడం వల్లనో విమానాలకు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడుతుంటారు. ఒక్కరి ప్రాణాలు కాపాడితేనే దేవుడు అంటారు. అలాంటిది ఏకంగా 185 మంది ప్రాణాలు కాపాడి వారి పాటిల దేవతలా మారింది ఓ మహిళా పైలట్. వివరాల్లోకి వెళితే..
పట్నా నుంచి ఢిల్లీకి బయలు దేరిన స్పైస్ జెట్ విమానం బోయింగ్ 737 టాకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ పక్షి ఢీ కొట్టింది. దీని వల్ల ఒక ఇంజన్ లో మంటలు చెలరేగాయి.. దీంతో అందులో ప్రయాణిస్తున్న 185 మంది ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక తాము చావడం ఖాయం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ప్రయాణీకులు పడుతున్న టెన్షన్ గమనించిన పైలట్ మోనికా ఖన్నా.. ఒకే ఇంజిన్‌తో విమానాన్ని సురక్షితంగా తిరిగి పట్నాలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన మోనికా ఖన్నాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Captain Monica khanna, the pilot in command today who saved 185 souls on board Boeing 737 operated by spice jet today at Patna!!! pic.twitter.com/xL3vXraT0a
— Emon Mukherjee (@EmonMukherjee21) June 19, 2022
ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఎంతో సమయస్ఫూర్తి, ధైర్యం ప్రదర్శించాల్సి వస్తుంది. మోనికా ఖన్నా చేసింది ఎంతో మంచి పని అని.. ఆమె ప్యాసింజర్ల ప్రాణాలు కాపాడమే కాదు.. మా గౌరవాన్ని కూడా నిలిపిందని ఫస్ట్ ఆఫీసర్ బల్ప్రీత్ సింగ్ భాటియాపై స్పైస్ జెట్ ప్రశంసలు కురిపించింది. విమానం నడపటంలో వారికి ఎంతో నైపుణ్యం ఉంది. పట్నాలో జరిగిన సంఘటనలో స్పైస్‌జెట్ పైలట్లు వ్యవహరించిన తీరు మాకు ఎంతో గర్వకారణం అన్నారు.
ప్రమాదం తర్వాత ఇంజినీర్లు విమానాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. అయితే టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొట్టటం వల్ల ఫ్యాన్ బ్లేడ్ విరిగిపోవటం, ఇంజిన్ పాడైపోయినట్లు ధ్రువీకరించారు. దీనిపై డీజీసీఏ విచారణ చేపట్టిందని అన్నారు కెప్టెన్ అరోడా. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.