ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. ఆ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అన్నం పెట్టే అన్నదాతలపై దారుణంగా కారు ఎక్కించి మరీ చంపడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇందుకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చీపురుతో ఆ గదిని ప్రియాంక గాంధీ శుభ్రం చేశారు. సీఎం యోగి దీనిపై కామెంట్ చేశారు. ‘దీని కోసం మాత్రమే వారు ఫిట్‌గా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అందుకే వారి స్థాయిని తగ్గించారు. వ్యతిరేకతను వ్యాప్తి చేయడం తప్ప వీరికి వేరే పని లేదు’ అని అన్నారు. తాజాగా ప్రియాంక గాంధీ శుక్రవారం లక్నోలోని దళిత ప్రాంతమైన లవ్ కుష్ నగర్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా చీపురు పట్టి అక్కడి మహర్షి వాల్మీకి ఆలయంలో శుభ్రం చేశారు. ‘దేశంలోని కోట్లాది మంది మహిళలు, పారిశుధ్య కార్మికులు శుభ్ర పరిచేందుకు ప్రతి రోజూ చీపురులను ఉపయోగిస్తారు. ఇది వారి సరళత, ఆత్మగౌరవానికి చిహ్నం’ అని అన్నారు. అంతే కాదు ఇటీవల సీఎం యోగి తన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కోట్లాది మంది దళిత సోదరులు, సోదరీమణులు, పారిశుధ్య కార్మికులను ఆయన అవమానించారని ప్రియాంక గాంధీ విమర్శించారు. చీపురును ఉపయోగించడం, శుభ్రపరచడం ఆత్మగౌరవ చర్య అని యోగిజీకి తెలియజేశానంటూ ఘాటుగా స్పందించారు. పార్టీలోని అన్ని జిల్లా కమిటీలు శనివారం వాల్మీకి దేవాలయాలను శుభ్రం చేస్తాయని ట్వీట్ చేశారు.
आज उप्र के मुख्यमंत्री ने जातिवादी बयान देकर अपनी दलित विरोधी मानसिकता दिखाई।
कल उप्र की सभी जिला कांग्रेस कमेटियां भगवान वाल्मीकि मंदिर में सफाई करेंगी।
देश के करोड़ों दलितों और महिलाओं का अपमान भारत बर्दाश्त नहीं करेगा। pic.twitter.com/RRcT9RmhGG
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 8, 2021