చదువుకోవాలనే తపన ఉండాలే కానీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన ధైర్యంగా అధిగమించవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు. అలా విపత్కమైన పరిస్థితులో ఉన్న యూపీ ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించారు.
చదువుకోవాలనే తపన ఉండాలే కానీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన ధైర్యంగా అధిగమించవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు. ఇటీవలే 55 ఏళ్ల మహిళ పదో తరగతి పరీక్షలు రాసి విజయం సాధించింది. అలానే ఎందరో తమ వయస్సు, తాము ఉండే పరిస్థితులతో సంబంధం లేకుండా చదువుకుని పరీక్షల్లో పాసవుతున్నారు. అయితే తాజాగా ఓ ప్రాంతంలోని ఖైదీలు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఉన్నతాధికారుల అంచనాలను మించి విజయం సాధించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నేరాలు చేసి.. ఎందరో ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈక్రమంలో పరీక్ష రాసిన 60 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇటీవలే యూపీలో పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పరీక్షా ఫలితాల్లో ఖైదీలు ప్రభజనం సృష్టించారు. పదో తరగతి రాసిన 60 మంది ఖైదీల్లో 95 శాతం మంది పాస్ అయ్యారు. అలానే ఇంటర్మీడియట్ రాసిన 64 మంది ఖైదీల్లో 70 శాతం మంది పాస్ అయినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తేలికైన పనులను ఖైదీలకు అప్పగించామని, దీంతో వారికి చదువుకునేందుకు తగిన సమయం దొరికిందని జైళ్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అలానే జైలు ఖైదీలు చదువుకునేందుకు అనుకూలంగా గ్రంథాలయాలను సైతం అందుబాటులోకి ఉంచామని అధికారులు వెల్లడించారు. పరీక్షలు రాసే సమయంలో తక్కువ శ్రమతో కూడిన పనులు అప్పగించడంతో తమకు చదువుకునే సమయం దొరికిందని ఖైదీలు వెల్లడించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ పాస్ అయిన ఖైదీలను పోలీసులు అభినందించారు. సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు ఇలాంటి అవకాశాలు మరిన్నో కల్పిస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మరి.. ఇలా పదో తరగతి పరీక్షల్లో ఖైదీలు 95 శాతం ఉత్తీర్ణత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.