అప్ఘానిస్తాన్‌లో తాలిబన్లు చేస్తున్న అల్లరిని యావత్ ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు ఆ దేశాన్ని అంతా ఆక్రమించుకుని దేశాన్ని పాలించేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయారు. తాలిబన్ల అరచకాన్ని చూడలేక ప్రధానితో పాటు దేశంలోని పౌరులంతా కట్టుబట్టలతో పారిపోతున్నారు. కొన్నేళ్లుగా అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకోవాలని తాలిబన్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు.
ఇక ఎట్టకేలకు వారి అనుకున్న రీతిలో ఏకంగా 10 రోజుల్లోనే దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుని ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నారు. కాబుల్ రాజధాన్ని మినహా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో తాలిబన్ల పరిపాలనలో ఉండలేమని ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు విమానాల్లో పరుగులు పెడుతున్నారు. ఇక తాజాగా తాలిబన్ల వ్యవహారం స్పందించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. తీవ్రవాద భావజాలంతో ముందుకొచ్చిన ఏ పాలన కూడా ఎక్కువ రోజులు ముందుకు వెళ్లలేదంటూ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు విధ్వంసక శక్తులు ఎప్పటికీ కూడా మంచిది కాదని ఆయన అన్నారు.