దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో ఆయన ఒక మంచి వ్యూహకర్తగా పిలుస్తుంటారు. ఇటీవల ఆయన సొంత రాష్ట్రంలో ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి జన్ సురాజ్ పేరు తో పాదయాత్ర చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్.. అందరూ పీకే అని పిలుస్తుంటారు. భారతీయ రాజకీయాల్లో బెస్ట్ రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రమైన బిహార్ లో ‘జన్ సురాజ్’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 2022 అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది. తాజాగా ఆయన పాదయాత్రకు బ్రేక్ వేశారు. వివరాల్లో వెళితే..
రాజకీయ వ్యూహకర్తగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తన సొంత రాష్ట్రమైన బిహార్ లో ‘జన్ సురాజ్’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎడమ కాలికి గాయం కావడంతో ఇబ్బంది పడ్డారు. ప్రశాంత్ కిషోర్ ని పరీక్షించిన వైద్యులు ఆయనను నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో జన్ సురాజ్ పాదయాత్ర కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాను కోలుకోగానే వెంటనే మళ్లీ జన్ సురాజ్ పాదయాత్ర ప్రారంభిస్తానని అన్నారు. ఒకవేల కుదరకుంటే జూన్ 11 నుంచి మళ్లీ యాత్రను ప్రారంభిస్తానని అన్నారు. 2022 అక్టోబర్ 2 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు 2500 కిలో మీటర్లకంటే ఎక్కువే నడిచారు.
వాలిసాహ్లి ప్రాంతంలో పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయన కాలుకి గాయం అయ్యింది. వెంటనే వైద్యులను సంప్రదించగా ఎడమ కాలిలోపలి భాగంలో దెబ్బతిన్నదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.. ఇటీవల అధ్వాన్నమైన రోడ్లపై రోజుకు 20 నుంచి 25 కిలో మీటరల వరకు నడవడం వల్ల కాలి కండరాలపై భారం పడి నడవడానికి ఇబ్బందిగా మారింది. కొద్దిరోజులు నన్ను కొన్నిరోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.. పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో తిరిగాను.. ఇకొన్ని ప్రాంతాలు తిరగాల్సి ఉంది. పూర్తిగా కోలుకున్న తర్వాత జన్ సురాజ్ పాదయాత్రను ప్రారంభిస్తాను’ అని అన్నారు.