మనిషి ఉన్నత స్థితికి చేరాలన్న, పాతాళంలోకి పడిపోవాలన్న.. కేవలం వారి వారి బుద్దులపై ఆధారపడి ఉంటుంది. కష్టపడి పనిచేసేవాడి ఫలితం ఆలస్యమైన తప్పక అందుతుంది. అడ్డదారుల్లో సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారు మాత్రం తప్పక సమస్యల్లో పడతారు. తాజాగా బెట్టింగ్ వ్యసనం ఉన్న ఓ పోస్ట్ మాస్టర్ తేరగా వచ్చే డబ్బును అనుభవించాలనుకున్నాడు. తన వద్ద ప్రజలు దాచుకున్న సొమ్ముతో ఐపీఎల్‌లో బెట్టింగ్ వేశాడు. ఆ సొమ్మంతా పొగొట్టి చివరికి కటకటాల పాలయ్యాడు. ఈఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినా సబ్ పోస్ట్ ఆఫీస్‌లో విశాల్ అహిర్‌వార్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి పోస్ట్ మాస్టర్ ఉద్యోగం ద్వారా వస్తున్న జీతం సంతృప్తి ఇవ్వలేదు. ఇంక ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అదికూడా తక్కువ కాలంలో సంపాదించాలని అనుకున్నాడు. ఈక్రమంలో బెట్టింగ్ లు అలవాటు చేసుకున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగులు పెడుతున్నాడు. ఈ ఐపీఎల్ బెట్టింగ్ లో దాదాపు కోటి రూపాయలకు పైనే పొగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బంతా అతడి సోమ్ము కాదు. తన వద్ద దాచుకున్న సుమారు 24 కుటుంబాలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము. వారి డబ్బులను ఐపీఎల్‌లో బెట్టింగ్ కోసం వాడుకున్నాడు.
ఇదీ చదవండి: చేతికి మట్టి అంటకుండా భార్యని చంపాడు! కానీ..కోర్టులో తప్పించుకోలేకపోయాడు!కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో విశాల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మే 20న బినా గవర్నమెంట్ రైల్వే పోలీసులు విశాల్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో చేసిన తప్పును అతడు ఒప్పుకున్నాడు. నిందితుడు పోస్ట్‌మాస్టర్ నకిలీ ఎఫ్‌డి ఖాతాల కోసం నిజమైన పాస్‌బుక్‌లను జారీ చేశాడని, గత రెండేళ్ల నుండి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టినట్లు పోలీసులు తెలిపారు. విశాల్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. మరి..మంది సొమ్ముతో ఇలా బెట్టింగ్ కాసి చివరికి జైలు పాలైన ఈ పోస్ట్ మాస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.