పోలీసులు అంటే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది.. ఏదైనా కేసు పెట్టడానికి వెళ్లాలన్నా భయంతో వణికిపోతుంటారు.. అక్కడ ఎదురయ్య ప్రశ్నలు తట్టుకోవడం కష్టం అనుకుంటారు. పోలీసులు కూడా మంచి మనసున్నవాళ్లని.. ఆపదలో ఉన్నవారిని ప్రాణాలకు తెగించిన కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ మహిళా ట్రాఫిక్ ఎస్సై గుండెపోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించి ఊపిరి పోసింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మద్యప్రదేశ్ గ్వాలియర్ లో ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాళ్లందరూ అతను మందు ఎక్కువై మైకంతో పడిపోయాడని భావించారు. ఎవరూ పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ లో పనిచూస్తున్న ఎస్సై సోనమ్ పరాసర్ కి అనుమానం వచ్చింది.. వెంటనే ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పరిశీలించగా అతను గుండెపోటుతో ఊపిరి ఆడక ప్రాణాపయంతో కొట్టుకుంటున్నట్టు అర్ధం అయ్యింది.. వెంటనే తన సహ ఉద్యోగీకికి అంబులెన్స్ కి ఫోన్ చేయమని పురమాయించింది. వెంటనే అతనికి సీపీఆర్ చేసింది.
ఆ వ్యక్తి ఊపిరి తీసుకోవడం సాధారణ స్థితికి వచ్చి వెంటనే దగ్గరలోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆపదలో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకొని వెంటనే సమయస్ఫూర్తి ప్రదర్శించి సకాలంలో సీపీఆర్ చేయడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని వైద్యులు తెలిపారు.. లేదంటే అతన్నిరక్షించడం చాలా కష్టమయ్యేదని వైద్యులు అన్నారు. ఇక ఆ మహిళా ట్రాఫికె ఎస్సై సోనమ్ పరాశర్ సీపీఆర్ చేసిన దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె చేసిన పనికి డిపార్ట్ మెంట్ వారే కాదు.. నెటిజన్లు సైతం ఎన్నో ప్రశంసలు లభించాయి.
पुलिस वाली इन दीदी को प्रणाम..ग्वालियर में एक व्यक्ति को राह चलते हार्ट अटैक आ गया।
चौराहे पर तैनात ट्रैफिक एस आई सोनम पाराशर द्वारा CPR देकर उनकी जान बचाई गई। @DGP_MP pic.twitter.com/2UhtsH5Lv5— Rajendra kumar चौधरी साहब (@Raj160793) December 12, 2022