ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి హైటెక్ వ్యభిచారం. అపార్ట్ మెంట్స్, స్పా సెంటర్లు, బ్యూటీ పార్లర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు రైడ్ చేసినా ఎక్కడో అక్కడ ఇలాంటి కేసులు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
డబ్బు లోకం దాసోహం అంటారు.. డబ్బు సంపాదించడానికి కొంతమంది కేటుగాళ్ళు ఎన్నో అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు. చైన్ స్నాచింగ్, డ్రగ్స్ దందా, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పపడుతూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో హైటెక్ వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంది. డబ్బు సంపాదన కోసం కొంతమంది దళారులు ఆడవాళ్లను పావుల్లా వాడుకుంటున్నారు. ఇటీవ పలు నగరాల్లో స్పా సెంటర్ల ముసుగులో హెటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్పా సెంటర్ ముసుగులో మగవాళ్లను ఆకర్షించి వారి నుంచి డబ్బు లాగుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
థానే జిల్లా కొంతమంది కేటుగాళ్ళు ఆడవాళ్లను అడ్డు పెట్టుకొని ఈజీ మనీకోసం అక్రమ దందాలు చేస్తున్నారు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి హైటెక్ వ్యభిచారం కొనసాగిస్తున్నారు. థానే జిల్లా కాషిమిరా ప్రాంతంలో కొంత కాలంగా ఓ స్పా సెంటర్ నడుస్తుంది. ఇటీవల ఇక్కడకు వచ్చే మగవారి సంఖ్య పెరిగిపోవడంతో స్థానికులకు అనుమానాలు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోటీసులు కాపు కాచి స్పా సెంటర్ ఆదివారం దాడులు నిర్వహించారు. స్పా సెంటర్ ముసుగులో మహిళలతో వ్యభిచారం నడిపిస్తున్నారని గుర్తించి.. ముగ్గురు మహిళలను రక్షించారు. స్పా సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
అరెస్ట్ చేసిన వారిలో స్పా సెంటర్ మేనేజర్ కాగా.. మరో వ్యక్తి స్పీపర్ అని పోలీసులు తెలిపారు. వీరిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు స్పా సెంటర్ యజమానిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు పోలీసులు. స్పా సెంటర్ ని మూసివేశారు. ఇలాంటి హైటెక్ వ్యభిచారాలకు పాల్పపడితే కఠినమైన శిక్షలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు. పేదరికంతో మగ్గిపోయే యువతులు, కాలేజీ చదువుతూ లగ్జరీ మెయింటేన్ చేయాలనుకునేవారిని తమ ఉచ్చులోకి లాగి వ్యభిచారం నిర్వహిస్తు డబ్బులు సంపాదిస్తున్నారు దళారులు. ఇందుకోసం అపార్ట్ మెంట్స్ తీసుకొని గుట్టుగా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.. దారుణమైన విషయం ఏంటేంటే ఈ దందాల్లో మహిళలు పురుషులకు సహకరిస్తున్నారు. స్పెషల్ సర్వీస్ అంటూ యువకులకు గాలం వేస్తూ డబ్బును లాగుతున్నారు. ఒక్కో అమ్మాయికి ఒక్కొ రేట్ ఫిక్స్ చేసి యువకులను ఆకర్షిస్తున్నారు.