పశ్చిమ బెంగాల్ పోలీసులు ఓ పదో తరగతి విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థిని పడుతున్న ఆవేదనను అర్ధం చేసుుకున్న స్థానిక ట్రాఫిక్ ఎస్సై గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశాడు. చివరకు తాను అనుకున్నది జరిగే సరికి ఆ బాలిక సంతోషం వ్యక్తం చేసింది.
గ్రీన్ కారిడార్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అత్యవసర పరిస్థితులో రహదారిని ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేయడానికి అధికారులు సిద్ధమవుతారు. తద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా సకాలంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇటీవలే టాలీవుడ్ హీరో తారకరత్నను బెంగూళురులోని హృదయాలయ ఆసుపత్రికి తరలించే సమయంలో గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. ఇలా ముఖ్యమైన వ్యక్తులు, అవయవాలను సకాలం ఆస్పత్రిలోకి చేర్చేందుకు ఈ గ్రీన్ కారిడార్ ను ఉపయోగిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కోల్‌కత్తాలో కూడా జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఓ సామాన్య విద్యార్థిని పరీక్ష కోసం గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. మరి… పరీక్ష కోసం ఈ కారిడార్ ను ఏర్పాటు చేయడం ఏంటనే కదా మీ సందేహం? మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌర బ్రిడ్జీ సమీపంలో ఓ పదో తరగతి విద్యార్థిని ఏడుస్తూ ఉంది. సాయం చేయాల్సిందిగా అటూ వెళ్లే పలువురిని కోరుకుతోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అలా చాలాసేపు ఏడుస్తూ ఆ యువతి తీవ్ర మనోవేదన చెందుతుంది. రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించిన వాహనం వెంటబడి మరి లిఫ్ట్ ఇవ్వమని కోరుతుంది. కానీ ఎవరూ ఆ విద్యార్థిని బాధను అర్థం చేసుకోలేదు. అక్కడే సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై సౌవిక్ చక్రవర్తి ఆ దృశ్యాన్ని చూశారు.
ఆ బాలిక వద్దకు వెళ్లి.. ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించారు. ఆ యువతి చెప్పిన సమాధానికి ఆ ఎస్సై కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, శాయం బజరా లోని ఆదర్శ్ శిక్ష నికేతన్ అనే పాఠశాలలో తన సెంటర్ పడిందని తెలిపింది. అంతేకాక తనకు పరీక్షకు టైమ్ అవుతుందని సాయం చేయమని, ఆ ఎస్సై ను కూడా ప్రాధేయపడింది.. మీ ఇంట్లో వారు తోడు రాలేదా? అని ఆ ట్రాఫిక్ పోలీస్ మరోసారి ప్రశ్నించాడు. తన తాత చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియాలకి వెళ్లారని ఆ విద్యార్థిని తెలిపింది. ఆ పాప పరిస్థితి అర్థం చేసుకున్న ఎస్సై చక్రవర్తి తన అధికారికి వాహనంలో ఎక్కించుకున్నారు.
పరీక్షకు కొన్ని నిమిషాలు మాత్రమే ఉండటంతో సాధారణంగా వెళ్తే అందుకోలేమని ఆ అధికారి భావించారు. వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని తన కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయానికిపరీక్ష కేంద్రం వద్ద దింపడంతో బాలిక పరీక్ష రాసింది. కోల్‌కతా పోలీసులు ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టు కాస్తా వైరల్ కావడంతో పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. కోల్‌కతా పోలీసులు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.