Journalist: నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ జర్నలిస్టుతో పాటు మరికొంతమంది నిరసనకారులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ దుస్తులు విప్పించారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం సింధి జిల్లాకు చెందిన ఓ డ్రామా స్కూల్ డైరెక్టర్ నీజర్ కుందర్ ఎమ్మెల్యే కేదార్‌నాథ్, అతడి తనయుడు గురుదత్‌లకు వ్యతిరేకంగా తన సోషల్‌మీడియాలో ఖాతాలో పోస్టులు పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు నీరజ్‌ను అరెస్ట్ చేశారు.
ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ యూట్యూబ్ జర్నలిస్టు కనిష్క్ తివారితో పాటు మరికొంత మంది నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ.. ప్రశాంతతను దెబ్బ తీస్తున్నారంటూ ఏప్రిల్ 2వ తేదీన పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు. అక్కడినుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారందరి దుస్తులు విప్పించి, డ్రాయర్‌పై నిలబెట్టించారు. ఏప్రిల్ 3వ తేదీన వారిని విడుదల చేశారు. అయితే, ఏప్రిల్ 7వ తేదీ అర్థనగ్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఉన్నతాధికారులు ఫొటోలను బయటకు విడుదల చేసిన వారిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వారి దస్తులు విప్పించినట్లు తెలిపారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత చాలా మంది తమ బట్టల్తో ఉరి వేసుకుంటుంటారని అందుకే అలా బట్టలు విప్పించామని తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆ క్షణం నా కళ్లు చెమ్మగిల్లాయి.. అందుకే కెమెరాలో బంధించా!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.