సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా.. దేశ ప్రజలకు రూ. 8 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అంతేకాదు మోదీకి ఇష్టమైన కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా పొందవచ్చునని ప్రకటించారు. మరి రూ. 8 లక్షలు లేదా కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. రేపు ఆయన 72వ వసంతంలోకి అడుగెడుతున్నారు. అయితే ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
In a unique way to celebrate the birthday of PM Narendra Modi which falls on September 17, a restaurant in Delhi’s Connaught Place has come up with the idea of launching a special ‘thali for customers’ same day. #lifestylehttps://t.co/TkcaN2OIrw
— Financial Express (@FinancialXpress) September 16, 2022
ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో ప్రధాని మోదీకి ఉన్నంత ఫాలోయింగ్ మరే నాయకుడికి లేదు. తన వాగ్ధాటితో ప్రజలకు చేరువయ్యారు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. పేద-ధనిక, క్లాసు-మాసు, శ్రామికుడు-పారిశ్రామికుడు అని తేడా లేకుండా ప్రతీ రంగంలోనూ మోదీకి అభిమానులు, వీరాభిమానులు ఉన్నారు. ఇలాంటి వారిలో సుమిత్ ఒకరు. ఈయన న్యూఢిల్లీలోని ‘ఆర్డర్ 2.1’ అనే రెస్టారెంట్ ని నడుపుతున్నారు. ప్రధాని మోదీ అంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. రేపు ప్రధాని మోదీ బర్త్ డే కాబట్టి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. అందుకోసం తన రెస్టారెంట్ కస్టమర్లకు ఒక వినూత్నమైన బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా తాలి అనే స్పెషల్ డిష్ ని లాంచ్ చేస్తున్నారు.
ఈ తాలి డిష్ కి ‘56 ఇంచ్ మోదీజి అనే పేరు కూడా పెట్టారు. 52 అంగుళాల ప్లేటులో 52 రకాల ఐటమ్స్ తో కూడిన ఈ డిష్ ని సర్వ్ చేస్తారు. కస్టమర్ల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ రెండూ ప్రొవైడ్ చేస్తారు. కపుల్స్ లో ఎవరైనా సరే 40 నిమిషాల్లో ఈ డిష్ ని పూర్తి చేస్తే.. వారు రూ. 8.5 లక్షలు గెలుచుకోవచ్చని ప్రకటించారు రెస్టారెంట్ ఓనర్ సుమిత్. అంతేకాదు సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26 వరకూ.. ఈ రెస్టారెంట్ లో ఈ తాలి డిష్ కొని తిన్న వారిలో లక్కీ డ్రా ద్వారా విన్నర్ లేదా లక్కీ జంటని సెలెక్ట్ చేసి కేథారనాథ్ ట్రిప్ కి పంపిస్తామని ప్రకటించారు. ఎందుకంటే కేథారనాథ్ మోదీకి ఎంతో ఇష్టమైన ప్రదేశమని రెస్టారెంట్ ఓనర్ వెల్లడించారు. మరి ప్రధాని మోదీపై ఉన్న గౌరవంతో కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రెస్టారెంట్ ఓనర్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.