ఈ మద్య కాలంలో విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ రోజు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికె శివకుమార్ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగింది.
కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష ముఖ్యనేతలు ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికె శివకుమార్ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగింది.. ఈ ఘటన మరువక ముందు ప్రధాని మోదీ హెలికాప్టర్ కి ప్రమాదం చోటు చేసుకోవడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో ఎన్నికల నేపథ్యంలో ముఖ్య నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ప్రచారాల్లో భాగంగా అక్కడక్కడ పలు అపశృతులు జరుగుతున్నాయి.ఈ రోజు కాంగ్రెస్ పీసీపీ చీఫ్ డికె శివకుమార్ హెలికాప్టర్ ని డేగ ఢీ కొట్టడంతో ముందుభాగం డ్యామేజ్ అయ్యింది. దీంతో పైలెట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మరువక ముందు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద ప్రమాదం తప్పింది. రాయచూర్ జిల్లా సింధనూరు లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ ప్రమాద వశాత్తు బురుదలో కూరుకు పోయింది. దీంతో అధికారులు ఒక్కసారే ఆందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ ను పైకి లేపడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దాదాపు వందమందికి పైగా సిబ్బందితో పాటు జేసీబీతో హెలికాప్టర్ ని పైకి లేపారు. అయితే అదృస్టం కొద్ది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదిలా ఉంటే ప్రధాని పర్యటించాల్సిన ఆ ప్రాంతాలన్నీ ఎందుకు తనిఖీ చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రాంతం పొలం కావడంతో ఎక్కువ బరువైన హెలికాప్టర్ అందులో కూరుకు పోయినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.