ఈ నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రధానంగా అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనపై చర్చించనున్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో ఆయనకు ఇదే మొదటి భేటి.అఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత స్థితిగతులు, కోవిడ్19, క్లైమెట్ చెంజ్, టెర్రరిజం అంశాల చర్చకు రానున్నాయి. ప్రధాని విదేశీ టూర్ షెడ్యూలింగ్ టీం ఈ నెల 9న అమెరికాకు వెళ్లనుంది. 23న ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు. బైడెన్‌తో భేటీతో ప్రధాని పర్యటన మొదలవుతుంది. మరికొంత ప్రముఖులతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా 25న యూఎన్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగించి, అనంతరం భారత్‌కు తిరుగుపయనం అవుతారు. కాగా ఈ ద్వైపాక్షిక భేటీలో తాలిబన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.