దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ.. ప్రధాని మోదీ దాదాపు 20 నిమిషాలు ఓ ఫ్లైఓవర్ పై ఆగిపోయారు. మోదీ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు అనేదే. ఆ ఘటన విషయంలో పంజాబ్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే అంటూ కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఘటనపై పంజాబ్ ప్రభుత్వాన్ని పూర్తి నివేదిక కోరింది. ఎన్నికల నేపథ్యంలో ప్రధానిని పంజాబ్ ప్రజలకు దగ్గర కానివ్వకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందంటూ బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భఠిండా విమానాశ్రయంలో పంజాబ్ అధికారులతో ఈ ఘటనపై స్పందించినట్లు సమాచారం. ‘మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పండి. భఠిండా విమానాశ్రయం వరకు ప్రాణాలతో రాగలిగాను’ అని ప్రధాని మోదీ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fearing a resounding defeat at the hands of the electorate, the Congress Government in Punjab tried all possible tricks to scuttle the PM @narendramodi Ji’s programmes in the state.
— Jagat Prakash Nadda (@JPNadda) January 5, 2022
Never before in the history of our country, a state govt knowingly constructed a scenario where the PM will be brought to harm. We know Congress hates Modi, but today they tried to harm the PM of India: Union Minister & BJP leader Smriti Irani pic.twitter.com/QUEyUOOIX0
— ANI (@ANI) January 5, 2022