కాప్-26 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు….స్కాట్లాండ్ లోని గ్లాస్గో చేరుకున్నారు ప్రధాని మోదీ. వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండాను గ్లాస్గొ సదస్సు వేదికగా ప్రకటించారు. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్-26 (COP26) మీట్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన విషయం తెలిసిందే. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26) 26వ సెషన్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ పలు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రజా సంబంధాలపై మాట్లాడారు.
భూమిపై జీవం ఉద్భవించినప్పటి నుండి, అన్ని జీవుల జీవన చక్రం సూర్యోదయం..సూర్యాస్తమయంతో ముడిపడి ఉందని మోడీ చెప్పారు. ఈ సంబంధం ఉన్నంత కాలం, మన గ్రహం కూడా ఆరోగ్యంగా ఉంది. అయితే ఇటీవల మనిషి సూర్యుడు సెట్ చేసిన చక్రాన్ని అధిగమించే రేసులో సహజ సమతుల్యతను దెబ్బతీశాడు. అలాగే, పర్యావరణానికి కూడా చాలా నష్టం కలిగించాడు అని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ ఈ సవాలుకు పరిష్కారం. వరల్డ్ వైడ్ గ్రిడ్ అనేది క్లీన్ ఎనర్జీని ప్రతిచోటా అందుబాటులో ఉండేలా చేస్తుంది. అన్ని సమయాల్లో, నిల్వ అవసరాన్ని తగ్గిస్తుంది. సౌర ప్రాజెక్టుల అవసరాన్ని పెంచుతుందని ప్రధాని మోడీ వెల్లడించారు.
pm narendra modiఇదిలా ఉంటే.. స్కాట్లాండ్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రవాసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోదీ. చిన్న పిల్లలను ఆప్యాయంగా పలుకరించి, ఆశీర్వదించారు. కాగా, ఈ సమావేశం ముగిసిన అనంతరం మోదీ ఇండియాకు బయల్దేరే ముందు భారతీయులు ఘనంగా వీడ్కోలు పలికారు.
#WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland
(Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW
— ANI (@ANI) November 2, 2021