ఇటీవల కాలంలో కుక్కల దాడి ఘటనలో ఇద్దరు బాలులు తీవ్రంగా గాయపడి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా ఓ పంది బాలుడిపై దాడి చేసింది. ఈ ఘటన వీడియోలు సోసల్ మీడియాలో వైరల్ అయింది.
గత కొన్ని రోజుల నుంచి వీధుల్లో కుక్కలు, ఎద్దులు వంట మూగ జీవాలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడి ఘటనలో ఇద్దరు బాలులు తీవ్రంగా గాయపడి చివరికి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా ఓ పంది బాలుడిపై దాడి చేసింది. వేగంగా పరుగెత్తుకొచ్చి ఆడుకుంటున్న పిల్లాడిని కిందపడేసి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
విషయం ఏంటంటే..? మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో ఇద్దరు, ముగ్గురు బాలులు కలిసి రోడ్డు మీద ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ పంది వేగంగా దూసుకొచ్చి ఓ బాలుడిని కిందపడేసింది. అంతేకాకుండా అతనిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. వెంటనే గమనించిన కొందరు స్థానికులు పందిని తరమికొట్టి ఆ బాలుడిని రక్షించారు. పంది దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన ఆ బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మూగజీవాలు పసి పిల్లలపై దాడి చేస్తున్న ఈ క్రమంలో మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
महाराष्ट्र के गोंदिया जिले में सुअर ने किया बच्चे पर हमला.
सुअर के बच्चे पर हमले की तस्वीरें सीसीटीवी कैमरे में कैद..
इस हमले में बच्चा गंभीर रूप से घायल, इलाज जारी.#Maharashtra pic.twitter.com/tL1NpdZu18
— Vivek Gupta (@imvivekgupta) March 14, 2023