గత రెండు రోజుల క్రితం పీఎఫ్ఐ ఆఫీసులు, ప్రతినిధుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు చోట్ల పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించిన సందర్భంగా పలు సంచలన విషయాలు బయట పడ్డాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగిందని ఈడి పేర్కొంది.
ఇటీవల ప్రధాని మోదీ బిహార్ లోని పాట్నా పర్యటించే సమయంలో దాడికి విఫలయత్నం చేశారని.. ఈ దాడులు నిర్వహించేందుకు పలువురికి శిక్షణ ఇచ్చి మారణాయుధాలు కూడా సమకూర్చినట్లు ఈడి తెలిపంది. ఏక కాలంలో ప్రధానితో పాటు యూపీకి చెందిన పలువురు ప్రముఖుపై దాడులు నిర్వహించేందుకు భారీ ప్లాన్ వేశారని ఈడి తెలిపింది.
పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ ఐ) కదలికలపై దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. తమ కార్యకలాపాల కోసం కొన్నేళ్లుడా విరాళ రూపంలో డబ్బు వసూళ్లు చేసినట్లు ఈడి దర్యాప్తులో తేలింది. ఎక్కువగా నగదు రూపంలో స్వీకరించి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి ఈ నిధులు కేటాయించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.