ప్రతి ఏటా సూర్యుడి తాపం పెరుగుతూనే ఉంది. తగ్గేదెలే.. అన్నట్లు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడి మంటలకు జనాలు అల్లాడుతున్నారు. అయితే ఈ సూర్యుడి వేడిని కూడా జనాలు వాడేసుకుంటున్నారు. నీళ్లను వేడి చేసుకోవడం, వడియాలు ఆరబెట్టుకోవడం వంటివి చేస్తున్నారు
ప్రతి ఏటా సూర్యుడి తాపం పెరుగుతూనే ఉంది. తగ్గేదెలే.. అన్నట్లు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడి మంటలకు జనాలు అల్లాడుతున్నారు. ఇటీవల కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు జనాలు భయపడిపోతున్నారు. అయితే ఈ సూర్యుడి వేడిని కూడా జనాలు వాడేసుకుంటున్నారు. నీళ్లను వేడి చేసుకోవడం, వడియాలు ఆరబెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఓ అడుగు ముందుకే ఏకంగా ఎండలో వంటలు చేస్తున్నారు. వారు చేసే వంటలు చూస్తే మీరు వావ్.. అనక మానరు.
గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎండల తీవ్ర రూపం దాల్చాయి. భయంకరమైన వేడిగాలులకు జనాలు విలవిల్లాడిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే మూడు రోజుల నుంచి ఎండలు భారీగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు అసలు తగ్గడం లేదు. దీంతో బెంగాల్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు స్కూళ్లు, కాలేజీలు కూడా సెలవులు ఇచ్చాయి. ఇక అందరూ ఇళ్లలోని గడిపేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ వ్లాగర్ ఎండ తీవ్రతను తెలియజేస్తూ ఓ వీడియో పెట్టాడు. అందులోని తన ఇంటి టెర్రస్ మీద కేవలం ఎండ వేడితో ఆమ్లెట్ వేసేస్తున్నాడు. పెనం మీద గుడ్డుని పగుల కొట్టి నూనెను వాడకుండా కేవలం ఎండ వేడితోనే ఆమ్లెట్ వేశాడు.
ఆ ఎండ వేడికి ఆమ్లెట్ స్టవ్ చేసిన మాదిరిగానే వచ్చింది. అలానే పాప్ కార్న్ కూడా ప్రిపేర్ చేశాడు. అది కూడా ఎంతో చక్కగా రెడీ అయ్యింది. ఇక ఆ రెంటినీ రుచి చూసి.. అద్భుతంగా ఉన్నాయంటూ ఆ వ్లాగర్ వివరించాడు. ఏప్రిల్ 9న వ్లాగర్ ఈ వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగానే లక్షల సంఖ్యలో జనం వీక్షించారు. మేము ఇలా చేయడానికి ప్రయత్నం చేసామని చాలామంది కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఎండ తీవ్రత ఎంత ఉందో అర్ధమవుతోంది కాబట్టి జనం తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.