ప్రస్తుతం నిత్యవసరల ధరల మొదలుకుని ప్రతి వస్తువుల ధరల పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజూ ఆకాశం వైపు చూస్తున్నాయి. ఈ ధరలతో పాటు గ్యాస్ ధర కూడా సామాన్యుడిపై పెనుభారం మోపుతుంది. ఇటీవల గ్యాస్ ధర వరుసగా రెండు సార్లు పెరిగింది. దీంతో ప్రజలపై మరింత భారం పడింది. ఈక్రమంలో గ్యాస్ వినియోగదారుల ఓ శుభవార్త. గ్యాస్ సిలిండర్ ఉచితంగా తీసుకుని అవకాశం ఉంది. మరి.. ఎలా గ్యాస్ సిలిండర్ ని ఉచితంగా పొందవచ్చు అనేక కదా మీ సందేహం. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎల్‌పీజీ సిలిండర్ ను బుక్ చేయడం చాలా కష్టంతో కూడకున్న వ్యవహారం. కానీ ఇప్పుడు క్షణాల్లో బుకింగ్ ప్రక్రియ అయిపోతోంది. అలా సిలిండర్ బుక్ చేసుకోవడానికి చాలా ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పేటీఎం కూడా ఒకటి. ఈక్రమంలో పేటీఎం ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వారికి ప్రత్యేకమైన ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా 100 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఒకటి ప్రస్తుతం నడుస్తోంది. అంటే సిలిండర్ పై చెల్లించే డబ్బులు పూర్తిగా వెనక్కి వస్తాయి. ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఉచితంగా గ్యాస్ సిలిండర్ ని పొందవచ్చు.
ఇదీ చదవండి: ఆ ఆలయంలో ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు.. ఇండియాలోనే!అయితే ఈ ప్రయోజనం పొందాలని భావించే వారు ఎల్‌పీజీ బుకింగ్ సమయంలో Gas1000 లేదా Free Gas అనే ప్రోమో కోడ్స్ ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఓ లాజిక్ పెట్టారు. అది ఏమిటంటే ఈ గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చే ఆఫర్ అందిరకీ అందుబాటులో ఉండదంట. డ్రా ద్వారా ఎంపికైన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరి.. పేటీఎం ఇచ్చిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.