సాధారణంగా ఐఏఎస్ అధికారి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది.. వారి అధికార హోదా. వారు ధరించే దుస్తులతో మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తారు. తన కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఈ ఐఏఎస్ లు ఏకిపారేస్తారు. కానీ అలాంటి ఐఏఎస్ లకు కూడా వారి పై వారి నుంచి చివాట్లు ఎదురవుతుంటాయి. అచ్చం అలానే తాజాగా ఓ ఐఏఎస్ పై హైకోర్టు జడ్జీ సీరియస్ అయ్యారు. కోర్టు ఏమైనా సినిమాహాలు అనుకుంటున్నారా.. అంటూ సదరు ఐఏఎస్ ను.. జడ్జీ ఏకిపారేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
“బీహార్ చెందిన ఆనంద్ కిశోర్ అనే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కోర్టు ప్రోటోకాల్ తెలియక జడ్జి చేతిలో అక్షింతలు వేయించుకున్నారు. ఈయన గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ.. ఓ కేసులో పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. అయితే, ఆయన ధరించిన దుస్తులు జడ్జి పీబీ భజంత్రీకి ఆగ్రహం తెప్పించాయి. దాంతో ఆ ఐఏఎస్ అధికారికి ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. “సాధారణ డ్రెస్ ధరించి రావడానికి ఇదేమైనా సినిమాహాలు అనుకుంటున్నారా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఎలాంటి డ్రెస్ తో కోర్టుకు రావాలో మీకు తెలియదా? ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీరు? ముస్సోరీలో మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, కోర్టుకు హాజరయ్యేటప్పుడు వేసుకోవాల్సిన దుస్తుల గురించి మీకు బోధించలేదా?
ఇదీ చదవండి: అన్న ఇంటికి ఎదురుగా 2 అడుగుల వెడల్పుతో భవనం కట్టిన తమ్ముడు!
మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని మీకు ఎవరూ చెప్పలేదా? కనీసం కోట్ అయినా ధరించాలి కదా!” అంటూ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. కాగా, జడ్జి చేతిలో మొట్టికాయలు తిన్న ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆనంద్ కిశోర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.