Rఈ మద్యకాలంలో పలు చోట్ల వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పలు కారణాల వల్ల ప్రమాదాలు సంభవించడంతో పైలట్లు సమయస్ఫూర్తితో ల్యాండింగ్ చేస్తున్నారు.
ఇటీవల దేశంలో పలు చోట్ల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు, ప్రకృతి అనుకూలించకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఆ మద్య అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో వైపు దిగుతుండగా వడగళ్ల వాన పడి విండ్‌షీల్డ్ దెబ్బతింది. వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎయిరిండియాకు చెందిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కు చెందిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి పారిస్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైర్ పేలిపోయింది. పెద్ద శబ్ధం రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. సురక్షితంగా ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.22 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా బోయిన్ 787 విమానం పారిస్ కు బయలుదేరింది. అయితే రన్ వేపై పేలిన టైర్ ముక్కలను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది గుర్తించారు.
విమానం టేకాఫ్ అయే సమయంలో టైరు పేలి ఉంటుందని అనుమానించిన ఏటీసీ వెంనటే విమాన క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పైలట్ అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. విమానాన్ని తిరిగి సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 220 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా.. ప్రస్తుతం విమానానికి తనిఖీలు చేస్తున్నామని.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని అన్నారు. ప్రయాణికులు తమ గ్యమస్థానం చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సంస్థ వెల్లడించింది.