తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలనే కోరితో ఉంటారు ప్రతి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాకుతూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది.. అలాంటిది తమ పిల్లలు తిరిగిరాని లోకానికి వెళ్తే.. వాళ్లు పడే ఆవేదన, బాధ వర్ణణాతీతం.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలనే కోరితో ఉంటారు. పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడతారు. వారికి ఏ చిన్న కష్టమొచ్చినా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. అలాంటిది తమ పిల్లలు కళ్ల ముందే కానరాని లోకాలకు పోతే విల విలలాడిపోతారు. కేరళాలో ఇలాంటి కష్టమే ఓ కుటుంబానికి వచ్చింది. ఇవిన్ ఫ్రాన్సిస్ అనే ఓ యువ వైద్యుడు అకస్మాత్తుగా కన్నుమూయడంతో తల్లితండ్రుల గుండె పగిలింది.. కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తమ తనయుడుకి జ్ఞాపకాల కోసం సమాధి రాయిపై ఓ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు ప్రత్యేక నివాళి అర్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సెంట్రల్ కేరళాలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన సెయింట్ జోసెఫ్ చర్చిని సందర్శించాడనికి వెళ్లినవారికి అక్కడో సమాధిని చూస్తే టక్కున ఆగిపోతారు.. ఎందుకంటే ఆ సమాధిపై పెద్దసైజ్ లో క్యూఆర్ కోడ్ రాసి ఉంటుంది. సమాధులపై చనిపోయిన వారి ఫోటోలు ఉండటం చూస్తుంటాం.. మరి ఈ క్యూఆర్ కోడ్ ఏంటా అని స్కాన్ చేస్తే అందులో ఉండే వివరాలు చూస్తే ఒక్కసారిగా ఎమోషన్ కి గురై కన్నీరు పెట్టుకుంటారు. ఆ సమాధి ఇవిన్ ఫ్రాన్సిస్ అనే యువ వైద్యుడిది. కేవలం 26 ఏళ్లకే ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న ఇవిన్ చదువులోనే కాదు.. క్రీడల్లో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. రెండేళ్ల క్రితం బాడ్మింటన్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
చిన్న వయసులోనే కొడుకు చనిపోవడంతో ఆయన తల్లిదండ్రులు కొంతకాలం కుమిలిపోయారు. తమ కొడుకు జ్ఞాపకాలను పదిలంగా ఉండాలనే ఆలోచనతో సమాధి రాయిపై ఓ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశాడు ఇవిన్ ఫ్రాన్సిస్ తండ్రి. ఇవిన్ ఫ్రాన్సిస్ సమాధిపై ఉన్న క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే అతడి జీవిత విశేషాలు, సృజనాత్మక ప్రతిభ కు సంబంధించిన వీడియోలు చూసే అవకాశం కల్పించారు. డాక్టర్ ఇవిన్ జీవితంలో ముఖ్య ఘట్టాలతో ఓ వెబ్ పేజీ రూపొందించి దాన్ని క్యూ ఆర్ కోడ్ తో అనుసంధానం చేశారు. స్కాన్ చేసిన వెంటనే ఐవిన్ కి సంబంధించిన ఫోటోలు, కాలేజ్ లో కీబోర్డు, గిటార్లతో ఇచ్చిన ప్రదర్శనలు, ఎడ్యూకేషన్ విషయంలో అతను ఇచ్చిన సూచనలు, సలహాలు అన్నీ చూడవొచ్చు.
చిన్నప్పటి నుంచి డాక్టర్ అయి సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉండేవాడు ఐవిన్. కానీ మృత్యువు అతన్ని చిన్నతనంలోనే కబలించింది. తమ కొడుకు హఠాత్తుగా కన్నుమూయడంతో అతని జ్ఞాపకాలను పదిలంగా ఉండేలా చేయాలనే ఉద్దేశ్యంతోనే త్రిసూర్‌లోని చర్చి వద్ద సమాధి రాయిపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇవిన్ ఫ్రాన్సిస్ గురించి తెలుసుకుంటున్నారు.