ఏ హోటల్‌కు వెళ్తే ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న.. "మీకు పెళ్లయ్యిందా? లేదా మీరు ఒకరికి ఒకరు ఏమవుతారు" అని. పెళ్లయ్యిందా ఒకే లేదంటే రూమ్ ఇవ్వమని ముఖం మీదే చెప్పేస్తారు. కానీ OYO రూమ్స్ బుక్ చేసుకుంటే అలాంటి ప్రశ్నలు ఎదురుకావని చెప్తుంటారు. అందుకే ఓయో రూమ్స్ బాగా ఫేమస్.
వాలెంటైన్స్ డే.. ప్రేమపక్షులు ఏడాదికి ఒక్కసారి చేసుకునే పండుగ. ఆ రోజున సరదాగా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకోవడంతో పాటు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని వ్యక్త పరుచుకుని, అందమైన అనుబంధాన్ని మరో మెట్టుపెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వారికి ఆ ఒక్కరోజే ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా భజరంగ్ దళ్ కార్యాకర్తలు. ఏ పార్కుకు వెళ్లినా.. ఆ సినిమా థియేటర్ కు వెళ్లినా వారే దర్శనమిస్తుంటారు. వీరి కళ్లలో పడ్డారా..? మూడు ముళ్లు వేపించి ఒక్కటి చేస్తారు. దీంతో అప్పటివరకు వారిమధ్యనే ఉన్న గాఢమైన ప్రేమ నలుగురికి తెలిసిపోతుంది. ఈ భయంతో లవర్స్ ప్రేమికుల రోజు కలవాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ ఓయో రూమ్స్ అభయమిచ్చే ప్రకటన చేసింది.
ఇద్దరు లవర్స్, కపుల్స్ హోటల్‌కు వెళ్తే ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న.. “మీకు పెళ్లయ్యిందా? లేదా మీరు ఒకరికి ఒకరు ఏమవుతారు” అని. పెళ్లయ్యిందా ఒకే లేదంటే రూమ్ ఇవ్వమని ముఖం మీదే చెప్పేస్తారు. కానీ OYO రూమ్స్ బుక్ చేసుకుంటే అలాంటి ప్రశ్నలు ఎదురుకావని చెప్తుంటారు. అందుకే ఓయో రూమ్స్ బాగా ఫేమస్. ప్రేమికుల రోజు సందర్బంగా హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే ప్రేమికులను 70 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.. ఓయో రూమ్స్. అందుకోసం ‘OYOCGS’ కౌపం కోడ్ ఎంటర్ చేయాల్సిందిగా సూచించింది. ఈ వార్త తెలిసిన గంటలోపే ప్రముఖ నగరాల్లోని ఓయో ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఈ డిస్కౌంట్ ని ప్రేమపక్షులు బాగానే ఉపయోగించుకున్నారట. ఏ హోటల్ లో చూసినా ‘నో రూమ్స్’ అన్న బోర్డులు దర్శమిస్తున్నాయట.
ఏదేమైనా.. ఓయో రూమ్స్ వారి ప్రకటన అద్భుతమనే చెప్పాలి. ఖాళీగా ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.. అదే ఇలాంటి ప్రకటన చేస్తే వచ్చే ఆ నాలుగు రాల్లైనా మేలేకదా అన్న వారి బిజినెస్ ఆలోచన సూపర్బ్ అని చెప్పాలి. ఒకరకంగా ప్రేమికుల రోజు ఓయో రూమ్స్ వారికి లాభాలు పంట పండిస్తే.. ప్రేమికులకు కలిసి ఉండేదుకు మార్గాన్ని చూపినట్లయింది. బయటతిరిగి పార్కుల వెంట తిరిగి నలుగురి కళ్ళల్లో పడటం కంటే ఓయో రూమ్స్ బెస్ట్ అని.. ప్రేమికులు కూడా చెప్తుండటం గమనార్హం. ఓయో రూమ్స్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.