ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తుంది. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ అందరిని కట్టిపడేస్తున్నారు.
నేటి ఆధునిక కాలంలో మనిషి అన్ని రంగాల్లో ఎన్నో అద్భుత ప్రయోగాలు చేసి విజయాలు అందుకుంటున్నాడు. భూమి, సముద్రం, అంతరిక్షం అన్నింటా తనదైన మార్క్ చాటుకుంటున్నాడు. ఈ మద్య ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ప్రపంచాన్ని ఏలేస్తుంది. మనుషులు మాన్యువల్ గా చేయాల్సిన ఎన్నో పనులు కంప్యూటర్లు సహాయంతో శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే చాట్ జీటీపీ ద్వారా చదవడం, రాయడం లాంటి ఎన్నో పనులు సునాయాసంగా చేస్తుంటే.. తాజాగా కృత్రిమ మేథ సహాయంతో ఏకంగా యాంకర్లను సృష్టించి టెలివిజన్ స్క్రీన్ పైకి తీసుకువస్తున్నారు. తాజాగా కృత్రిమ మేథ సాయంతో ఓ న్యూస్ యాంకర్‌ను రూపొందించింది ఒడిశాకు చెందిన ఓటీవీ. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో కృత్రిమ మేథ తో ప్రపంచంలో జరుగుతున్న అద్భుతాలు అందరిని కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే. ఒడిశాలోని ఓటీవీ అనే వార్తా ఛానెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంలో పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ ని రూపొందించారు.. దీని పేరు లిసా అని నామకరణం చేశారు. ఆదివారం లిసాను లాంచ్ చేసింది ఓటీవీ. వాస్తవానికి లిసా అనేక భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలనే చదువుతుందని వార్తా సంస్థ ఎండీ లతిషా మంగత్ పాండా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పనితో కూడుకుంది.. అయినప్పటికీ మేం సాధించాం. త్వరలో ఇతరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా సంసిద్దం చేస్తాం’ అని అన్నారు.
టివీలో న్యూస్ చదువుతున్న యాంకర్ లిసా.. ఒడిశా సాంప్రదాయ చేనేత చీరను ధరించింది చక్కటి ఆహార్యంతో ఒరియాతో పాటు ఇంగ్లీష్ వార్తలు చదువుతుంది. నిజమైన యాంకర్ వచ్చి తెరపై వార్తలు చదువుతుందా అన్నంత రియాల్టీగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒడియా టెలివిజన్ జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను లిసా ద్వారా పరిచయం చేయడం గొప్ప అనుభూతినిస్తుందని ప్రశంసింస్తున్నారు. ఓటీవీ భువనేశ్వర్ కి చెందిన వార్తా సంస్థ. 1997 లో జంటనగరాలైన భువనేశ్వర్, కటక్ లో ప్రారంభించారు. ఈ వార్తా సంస్థను జాగీ మంగత్ పాండా ప్రారంభించారు. ఓటీవీ రాష్ట్రంలోనే మొదటి ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా. 2006 నుంచి కేబుల్ నుంచి శాటిలైట్ చానల్ గా మారింది.
Meet Lisa, OTV and Odisha’s first AI news anchor set to revolutionize TV Broadcasting & Journalism#AIAnchorLisa #Lisa #Odisha #OTVNews #OTVAnchorLisa pic.twitter.com/NDm9ZAz8YW
— OTV (@otvnews) July 9, 2023