ఇటీవల దేశంలో పలు చోట్ల కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలోభారీ పేలుళ్లు సంభవించాయి. గతంలో కూడా పలు మార్లు గుజరాత్ లో కెమికల్ ఫ్యాక్టరీలో పలు సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి.
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది ఫ్యాక్టీరీ యజమానుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పెలుడు సంభవించింది. దీంతో ఓ కార్మికుడులు దర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
దహెజ్ పారిశ్రామిక వాడలో ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుళ్లు కారణంగా ఆరుగురు కార్మికులు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. . సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.