ప్రస్తుత కాలంలో ఏదైనా మార్కెట్ కి పోతే.. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే పాట గుర్తుకు వస్తుంది. కరోనా తర్వాత నిత్యావసర సరుకులు ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి.. రాబడి కొంత అయితే.. ఖర్చులు కొండంతగా మారిపోయాయి. ఉప్పు.. పప్పు.. నూనె ప్రతీది సామాన్యులకు పెను భారంగా మారిపోయాయి.
దేశంలో ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలకు అడ్డూ.. అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు కరోనా కష్టాలతో ప్రజలు అల్లాడుతుంటే.. ఇప్పుడు పెరిగిపోతున్న నిత్యవసర సరుకుల ధరలు మరింత భారం అవుతున్నాయి. వంట నూనె మొదలు సబ్బుల వరకు రోజువారీ ఉపయోగించే సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీనికి తోడు కరోనా తర్వాత కొత్త కొత్త రోగాలు రావడంతో ఆస్పత్రికి మరిన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. కరోనా సమయంలో ఇమ్యూనిటీ పెరగడం కోసం ప్రొటీన్లు కలిగిన పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో జీడిపప్పుకి బాగా డిమాండ్ పెరిగింది. దాంతో జీడిపప్పు రేటు కూడా బాగా పెరిగిపోంది. క్వాలిటీని బట్టి కిలో 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెట్టాల్సిందే. అలాంటిది ఇప్పుడు కిలో 30 రూపాయలకే దొరుకుతుంది. ఇంత తక్కువ ధర ఎక్కడో తెలుసుకోవలని ఉందా.. పూర్తి వివరాలు మీ కోసం..
జీడిపప్పులో అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే గుణం ఉంటుంది. జీడిపప్పులో ఉండే విటమిన్-ఇ ధమనులలో ఫలకం ఉత్పత్తిని నిరోధించి రక్తప్రసరణను తగ్గిస్తుంది. అందుకే వైద్యులు ఇమ్యూనిటీ కోసం జీడిపప్పు తినాలని సూచిస్తుంటారు. అయితే మార్కెట్ లో జీడిపప్పు ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. మంచి క్వాలిటీ జీవిపప్పు ఇప్పుడు వెయ్యి రూపాయల వరకు మార్కెట్ లో దొరుకుతుంది. అలాంటి జీడిపప్పు అతి తక్కువ ధరకే దొరుకుంతుందంటే ఎవరికైనా సంతోషమే.. ఇది నిజం. జార్ఖండ్.. జంతార అనే జిల్లా నాలా అనే గ్రామంలో కేవలం రూ.30 రూపాయలకే కిలో జీడిపప్పు అమ్ముతారు. నాలా గ్రామాన్ని ‘జార్ఖ్ండ్ జీడిపప్పు నగరం’ అని పిలుస్తారు. ఇక్కడికి చుట్టుప్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్వాలిటీ జీడిపప్పును కొనుగోలు చేసి తీసుకు వెళ్తుంటారు.
నాలా ఈ గ్రామంలో 50 ఏకరాల విస్తీర్ణంలో జీడి తోటలను వేశారు. 2010 లో నాలా గ్రామంలో జీడిపప్పు సాగు కి మంచి అనుకూలంగా ఉన్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాదు రైతులకు ప్రభుత్వ తరుపు నుంచి ప్రోత్సహించారు. అప్పటి నుంచి రైతులకు జీడిపప్పు సాగుపై దృస్టి సారించడం మొదలు పెట్టారు. ఇందులో జంతారా జిల్లా డిప్యూటీ కమీషనర్ కృపానంద ఝా ఎంతో కృషి చేశారు. జీడి పప్పు తోటలు వేసి రైతులు కూడా మంచి లాభాలు వస్తాయని భావించారు.. కానీ విచిత్రం ఏంటేంటే చుట్టుపక్కల నుంచి వచ్చే జనాలు రూ.30 కే కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ల పక్కన పెట్టి మరీ అమ్ముతుంటారు. కొంతమంది దళారుల ఇక్కడ నుంచి బయటకు తీసుకు వెళ్లి బాగా లాభాలు ఆర్జిస్తున్నారు.