Bhagwant Mann : అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం తమ మార్కు పాలనను చూపిస్తోంది. సరికొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆప్ ముఖ్యమంత్రి భగవత్ మన్న్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా ‘ ఒక ఎమ్మెల్యే ఒక పింఛన్ ’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇకపై ఎమ్మెల్యేలకు ఒక పింఛన్ మాత్రమే వస్తుందని శుక్రవారం ప్రకటించారు. సాధారణంగా టర్ములను బట్టి ఎమ్మెల్యేల నెల పింఛన్‌లో మార్పులు ఉంటాయి. ఒక టర్ముకు 75,150 నెల పింఛన్ వస్తుంది. రెండో టర్ముకు ఇది డబుల్ అవుతుంది. మూడో టర్మ్‌కు ట్రిబుల్ అవుతుంది. అలా ఎన్నిసార్లు పనిచేస్తే పింఛన్ అమౌంట్ 75వేలు పెరుగుతుంది. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. అందుకే దీని స్థానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నారు.
రెండు, అంతకంటే ఎక్కువ టర్ములు ఎమ్మెల్యేగా పని చేసినవారికి రెండవ టర్మునుంచి రూ.75,150లో 66 శాతం మాత్రమే అదనంగా ఇవ్వనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి భగవత్ మాట్లాడారు.. ‘‘ మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు లక్షల్లో పింఛన్ తీసుకోవటం చూస్తే షాక్ అవుతాం. వాళ్లు విధాన సభకు కూడా రారు. అలాంటి వాళ్లు ఒక్కోళ్లు ఒకలా 3.50 లక్షలనుంచి 5.25 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అంతేకాదు! వీరిలో కొందరు ఎంపీలుగా పని చేసి, ఆ పింఛన్‌కూడా తీసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. అంతేకాదు! ఎమ్మెల్యేల ఫ్యామిలీ పింఛన్లను కూడా తగ్గించమని అధికారులకు చెప్పా’’నని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భూకబ్జా కేసులో కోర్టుకు హాజరైన పరమశివుడు..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.