తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా కేంద్రంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతి సారి కేంద్రం తప్పిదాలను ఎండగడుతున్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే.. బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు దీవిస్తే.. తాను ఢిల్లీ కోటలు బద్దలు కొడతానని తెలిపారు. జాతీయ స్థాయిలో పార్టీ స్థాపించి.. బీజేపీకి ప్రత్యామ్నయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పీకే టీమ్ తో సర్వే చేయించనట్లు తెలిపారు. ఇక కేసీఆర్ ప్రయత్నాలకు బీజేపీయేతర ముఖ్యమంత్రుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మాజీ సీఎం దేవెడౌడ కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే దేశ వ్యాప్యంగా బీజేపీ మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి : జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త పార్టీ! విజయం సాధ్యమేనా?
ఇలాంటి క్రమంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఆలోచనపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడినట్లు కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. అందుకు ఉదాహరణ.. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ లో ఫ్లెక్సీలు ఏర్పటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బీజేపీకి కంచుకోటలాంటి గుజరాత్ లో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఆ టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ స్వరాష్ట్రంలో కేసీఆర్ కు అభిమానులు ఉన్నారని.. త్వరలోనే ఇది అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక కేసీఆర్ పేరు మీద అన్నదానం కూడా చేశారు. ఇక గుజరాత్ లో కేసీఆర్ ఫ్లెక్సీ కనిపించడం బీజేపీ వర్గాలను షాక్ కు గురిచేసింది.
ఏది ఏమైనా జాతీయా స్థాయిలో రాణించాలనే కేసీఆర్ ప్రయత్నాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడిందని.. దీన్ని ఇలానే కొనసాగిస్తే.. జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రభావం చూపడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. ఇక గతంలో దీదీకి కూడా పక్క రాష్ట్రాల్లో ఇలాంటి సానుకూల అనుభవం ఎదురయ్యింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : రిపోర్టర్ పై KCR ఆగ్రహం.. ప్రెస్ మీట్ లో అందరి ముందే..