గత కొన్నిరోజుల నుంచి ప్రపంచంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఆ వేరియంట్ ఆందోళనకరమే అయినా.. దాని వల్ల మాత్రం ఇప్పటి వరకు మరణాలు సంభవించలేదని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
తాజాగా గుజరాత్ లోని జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఆఫ్రికాలోని జింబాబ్వే నుంచి ఇటీవల స్వగ్రామనికి చేరుకోగా.. తాజాగా అతనికి ఒమిక్రాన్ వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి జేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే ఆ వ్యక్తి జింబాబ్వే నుంచి స్వగ్రామనికి చేరుకున్న తర్వాత 90 మందిని కలిసినట్లు అధికారులు నిర్ధరించారు. దాంతో అతనిని కలిసిన వారిలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం వారందరి సమాచారం తెలుసుకుని, పరీక్షలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం గురువారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో వెలుగు చూసిన రెండు ఒమిక్రాన్ కేసుల్లో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా దేశస్థుడని, మరొక వ్యక్తి ప్రభుత్వ వైద్యుడని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణాఫ్రికా దేశస్థుడు కోలుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
A man in Gujarat’s Jamnagar has tested positive for the #Omicron variant of Covid-19, said state health department today.
https://t.co/Y3r8ywQY0W— Mint (@livemint) December 4, 2021