నేటికాలంలో ప్రతి వస్తువులు అప్ డేట్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి. నిన్నటి కంటే నేడు ఎంతో కొత్త కొత్త ఫీచర్లతో వివిధ రకాల వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకే చోరీకి గురైన కూడా క్షణాల్లోనే పోలీసులు క్షణాల్లో పట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ బైక్ విషయంలో అలాంటి సంఘటన జరిగింది.
నేటికాలంలో ప్రతి వస్తువులు అప్ డేట్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి. నిన్నటి కంటే నేడు ఎంతో కొత్త కొత్త ఫీచర్లతో వివిధ రకాల వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, బైక్, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువుల విషయంలో ఇలాంటి అప్ డేట్ లో తరచూ జరుగుతుంటాయి. మన వస్తువును ఎవరైన దొంగిలించినా, పొరపాటున ఎక్కడైన పడిపోయిన గుర్తించే సాంకేతిక పరిజ్ఞాన్ని కూడా వస్తువుల్లో, వాహనాల్లో అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా ఓలా బైక్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లు.. ఇటీవల దొంగతనం సమయంలో బైక్ ను గుర్తించడానికి సహాయబడ్డాయి. అసలు ఆ పూర్తి స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ బైక్ సంస్థల్లో ‘ఓలా’ ఒకటి. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ ల విషయంలో ప్రారంభంలో కొన్ని సమస్యలకు గురైంది. అయితే ప్రస్తుతం మంచి సంఖ్యలో అమ్మకాలను పొందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో పొందుపర్చిన అప్ డేట్ ఫీచర్స్ అనే చెప్పాలి. ఇందులోని ఆ కొత్త ఫీచర్స్ ఇటీవల దొంగతనం సమయంలో కూడా గుర్తించడానికి సహాయ పడ్డాయి. ఓ మీడియా కథనంలో రాసిన ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన ‘అంజలి పాల్’ అనే మహిళకు చెందిన ఓలా బైక్ ను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు.
ఆ తరువాత మూవర్స్ అండ్ ప్యాకర్స్ సహాయంతో ఆ బైక్ ను వేరే నగరానికి పంపించాలనుకుని దానిని పూర్తిగా ప్యాక్ చేసి ఉంచారు. ఈలోపు అంజలి.. తన బైక్ చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఎలక్ట్రిక్ స్కూటర్లోని జీపీఎస్ నావిగేషన్ ఉన్నట్లు అంజలి పోలీసులకు తెలిపింది. ఓలా బైక్ లోని జీపీఎస్ సహాయంతో పోలీసులు చోరీకి గురైన బైక్ ను పట్టుకున్నారు. జోధ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో ఈ స్కూటర్‌ను పోలీసులు గుర్తించారు. ఎప్పుడైన బైక్ దొంగిలించబడిన తరువాత అది ఎక్కడ ఉందో కనిపెట్టడానికి సదరు బైక్ యజమాని లోకేషన్ ట్రాకింగ్ అనే ఫీచర్ ను ఉపయోగించవచ్చు.
ఈ విధంగానే అంజలి పాల్ తన స్కూటర్ కనిపెట్టగలిగింది. గతంలో కూడా జీపీఎస్ లొకేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా అనేక హై ఎండ్ కార్లు రికవరీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది నిజంగా బైక్ కస్టమర్లకు వరమనే చెప్పాలి. చాలా మంది ఎంతో ఇష్టంగా బైక్ లను కొనుకుంటారు. కానీ వారి ముచ్చట తీరకుండానే కొందరు ఆ బైక్ లను దొంగిలించి.. యజమానిని మనోవేదనకు గురి చేస్తారు. అయితే తాజాగా ఓలా కంపెనీ అందించిన ఈ ఫీచర్లు.. వారి కస్టమర్లకు వరమనే చెప్పాలి. మరి.. ఓలా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.