టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఒడిశా విషాద బాధితులకు సాయం అందించేందుకు చాహల్ ముందుకొచ్చాడు.
ఒడిశా రైలు ప్రమాద వార్త యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ న్యూస్ విని ప్రజలందరూ దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఈ విషాదంలో మరణించిన వారి సంఖ్య దాదాపుగా 300కి చేరువలో ఉంది. గాయపడిన వారి సంఖ్య 11 వందలకు పైనే ఉంది. గాయపడిన వారిలో కొందరు డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారని సమాచారం. ఇండియన్ రైల్వేస్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో గల్లంతైన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కొందరి ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపేందుకు సీబీఐని రంగంలోకి దించారు. రైళ్లలో సేఫ్టీకి కీలకంగా భావించే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను మార్చడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఒడిశా విషాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందా? ఎవరైనా కావాలనే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో మార్పులు చేశారా అని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తే గానీ పూర్తి విషయాలు బయటడేలా కనిపించడం లేదు. ఇదిలాఉంటే.. రైల్వే ప్రమాద బాధితులకు సాయం అందించేందుకు అందరూ కదలివస్తున్నారు. బాధితుల క్లెయిమ్‌ల విషయంలో సడలింపులు ఇస్తామని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తానని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు మరో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాను కూడా సాయం అందిస్తానని ముందుకొచ్చాడు. రూ.1 లక్షను విరాళంగా ఇచ్చాడీ లెగ్ స్పిన్నర్. ఒడిశా రైలు బాధితుల కోసం స్కౌట్ అనే గేమింగ్ ఛానల్ నిర్వహిస్తున్న ఛారిటీ వర్క్‌కు ఈ డొనేషన్‌ను అందించాడు చాహల్.
Yuzi Chahal donated 1 Lakh for the Odisha train accident in the stream conducted by the “scOut” gaming channel for charity work for the train accident. pic.twitter.com/nCNHzEc5jB
— Johns. (@CricCrazyJohns) June 5, 2023