దెయ్యాలు, దేవుడు.. ఈ రెండింటి ఉనికి గురించి అనాదిగా ఎన్నో సిద్ధాంతాలు, కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. 20-30 ఏళ్ల క్రితం వరకు ఇలాంటి వాటిని జనాలు ఎక్కువగా నమ్మేవారు.. అయితే ప్రస్తుతం పెరిగిన శాస్త్రసాంకేతికత కారణంగా.. ఇలాంటి వాటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తున్నారు. అయితే నేటి కాలంలో కూడా గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో.. దెయ్యాలు, మూఢనమ్మకాలను ఇంకా పాటిస్తున్నారు. ఫలితంగా నేటికి కూడా మన సమాజంలో దొంగబాబలు లెక్కకు మిక్కిలి తయారవుతున్నారు. జనాల బలహీనతలను ఆసారాగా చేసుకుని.. వారి దగ్గర నుంచి డబ్బలు వసూలు చేస్తున్నారు. అయితే కొన్ని సంఘటనలను చూస్తే.. మూఢనమ్మకాలు అని అనలేం కానీ.. అలా ఎందుకు జరుగుతుందో కూడా వివరించలేం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో ఏనుగు మహిళపై పగబట్టి.. ఆమెను తొక్కి చంపింది.. అంతటితో ఆగక.. అంత్యక్రియల సమయంలో కూడా వచ్చి.. రచ్చ చేసింది. ఈ సంఘటన చూసిన వారంతా సదరు మహిళ భర్త ఆత్మే ఏనుగులో ప్రవేశించి.. ఇలా చేసింది అంటున్నారు ఊరి జనాలు. ఆ సంఘటన వివరాలు..
ఒడిశా బరిపదాలోని రాయ్‌పల్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది మయ ముర్మూ(70). మంచి నీటి కోసం గురువారం పంపు మోటర్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో దాల్మా వైల్డ్‌లైప్ శాంక్చురీ నుంచి పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. మృతి చెందింది. దాంతో ఆమె బంధువులు సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఊరేగింపు తర్వాత.. ముర్మూ మృతదేహాన్ని చితి మీద ఉంచారు. అయితే అదే సమయంలో మళ్లీ హఠాత్తుగా అదే ఏనుగు అక్కడ ప్రత్యక్షమైంది. దీంతో జనాలంతా చెల్లాచెదురైపోయారు.
ఇది కూడా చదవండి: Straberry Moon: ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్.. ఏంటీ మిస్టరీ!
ఈసారి ఏనుగు చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి కిందపడేసి తొక్కింది. ఆపై గిరగిరా తిప్పేసి దూరంగా విసిరేసి.. అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడున్నవాళ్లంతా తీవ్రంగా భయపడ్డారు. కాసేపు అయ్యాక వచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి వెళ్లిపోయారు. ఆతర్వాత ఓ ప్రచారం వెలుగులోకి వచ్చింది. చనపోయిన ముర్మూ భర్త ఆత్మే ఏనుగు శరీరంలో ప్రశేవించి.. ఆమెపై పగ తీర్చకుంది అంటూ మాట్లాడుకోసాగారు.
ఇది కూడా చదవండి: Viral Video: బిడ్డను కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి పోరాడిన తల్లి ఎలుగు బంటి.. చివరకు..
ఇక ముర్మూ భర్త ఏడేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆ పెద్దాయనకు భార్యే విషం పెట్టి చంపిందనే పుకారు ఒకటి ఊరిలో వినిపిస్తుందట. దాంతో ముర్మూ చేతిలో చనిపోయిన ఆమె భర్తే ఆత్మగా మారి.. ఆ ఏనుగు శరీరంలో ప్రవేశించి.. ఆమెపై దాడి చేసి చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటాడని మాట్లాడుకోసాగారు. అంతేకాక ఏనుగు ముర్మూ మృతదేహంపై దాడి చేసింది కానీ గ్రామస్తుల జోలికి రాలేదు అంటే.. అది కచ్చితంగా ముర్మూ భర్త ఆత్మ ఏనుగును ఆవహించింది అని జోరుగా ప్రచారం చేయసాగారు. అయితే అటవీ అధికారులు మాత్రం ఏనుగు ప్రకోపానికి కారణం ఏదైనా ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Truck Tire: అయ్యో పాపం! టైరు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు